ముంబై: భారత్‌లోకి ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ పెట్టుబడుల ప్రవాహం మే నెలలో తగ్గింది. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే గత నెలలో 44 శాతం, ఈ ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే 52 శాతం మేర పెట్టుబడులు తగ్గాయి. 3.5 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2022 మే నెలలో ఇవి 6.2 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో 7.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పరిశ్రమ లాబీ ఐవీసీఏ, కన్సల్టెన్సీ సంస్థ ఈవై రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
చాలా మటుకు ఫండ్స్ గత ఏడాదిన్నరగా పుష్కలంగా నిధులు సమీకరించినప్పటికీ వాటిని ఇన్వెస్ట్ చేసే విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాయని ఈవై పార్ట్‌నర్ వివేక్ సోని తెలిపారు. వృద్ధి, మార్జిన్లను మెరుగుపర్చుకునేందుకు నానా తంటాలు పడుతున్న ప్రస్తుత పోర్ట్‌ఫోలియో కంపెనీలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయని వివరించారు. పెట్టుబడులపరంగా టెక్ రంగంలో కాస్త స్తబ్దత నెలకొందని పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ, ఆరి్థక సేవల విభాగాల్లోకి కాస్త పెట్టుబడులు వచి్చనట్లు సోని వివరించారు. మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా చూస్తే పెట్టుబడుల ప్రవాహం ఆశావహంగానే కనిపిస్తోందని, 2023లో మొత్తం పెట్టుబడులు గతేడాది కన్నా ఎక్కువగానే ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
నివేదికలోని మరిన్ని విశేషాలు..
► మే నెలలో మొత్తం 71 లావాదేవీలు జరిగాయి. గతేడాది మే నెలతో పోలిస్తే 42 శాతం తగ్గాయి.
► వృద్ధి దశలోని సంస్థల్లో పెట్టుబడులు 4 శాతం తగ్గాయి. 17 డీల్స్ కుదరగా 1.9 బిలియన్ డాలర్లు వచ్చాయి. 2022 మే లో 19 ఒప్పందాలు కుదరగా, 2 బిలియన ్డాలర్లు వచ్చాయి.
► రియల్ ఎస్టేట్‌పై ఫండ్స్ అత్యధికంగా ఆసక్తి చూపాయి. ఏడు డీల్స్ ద్వారా 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. 2022 మే నెలలో 12 డీల్స్ ద్వారా 1.1 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్లు వచ్చాయి. 864 మిలియన్ డాలర్ల పెట్టుబడులు, 15 డీల్స్‌తో టెక్నాలజీ రంగం రెండో స్థానంలో నిల్చింది. ఈ రంగంలో పెట్టుబడులు 159 శాతం పెరిగాయి.
► ఫండ్స్ గతేడాది మేలో 745 మిలియన్ డాలర్లు సమీకరించగా.. ఈసారి 2.2 బిలియన్ డాలర్లు సమీకరించాయి.
Comments
Please login to add a commentAdd a comment