51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు సూపర్‌స్టార్ రజినీకాంత్ ఎంపికైన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక అవార్డును సోమవారం రోజున(అక్టోబర్ 24)న రజినీకాంత్ అందుకోనున్నారు. దాదా సాహెబ్ అవార్డును అందుకోవడంతో పాటు తన కూతురు సౌందర్య విశగన్‌కు రూపొందించిన సోషల్‌మీడియా యాప్‌ను కూడా లాంచ్ చేయనున్నారు. ఈ సందర్భంగా రజినీకాంత్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో నెటిజన్లతో ఓ లేఖను పంచుకున్నారు.
చదవండి: సెల్ ఫోన్ వాడకం..యాప్స్‌పై గడిపే సమయం సుమారు రోజుకు 5 గంటలు
ఈ లేఖలో రజినీకాంత్... ‘రేపు నా జీవితంలో రెండు ముఖ్యమైన విషయాలు జరగనున్నాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం నుంచి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును తీసుకోవడం..మరోకటి నా కూతురు సౌందర్య విశగన్‌కు రూపొందించిన సోషల్‌మీడియా యాప్‘ హూట్’(HOOTE)ను లాంచ్ చేస్తున్నాని పేర్కొన్నారు. సోమవారం రోజున తన స్వరంతో హూట్ యాప్‌ను ప్రారంభించనున్నట్లు సూపర్‌స్టార్ రజినీకాంత్ తెలిపారు.
హూట్ యాప్ ఏంటీ..?
హూట్ అనేది వాయిస్ ఆధారిత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ యాప్. ఈ యాప్‌లో యూజర్లు తమ అభిప్రాయాలను ఇతరులతో పంచుకోవచ్చును. హూట్ యాప్‌ను వాడే యూజర్లు తమకు నచ్చిన ఏ భాషలోనైనా వారి ఆలోచనలను, అభిప్రాయాలను వారి వాయిస్ రూపంలో వ్యక్తపరచడానికి ఉపయోగపడుతుంది. ఇది కాస్త క్లబ్‌హౌజ్ వాయిస్ బేస్‌డ్ యాప్‌లాగా పోలీ ఉంటుంది.
🙏🏻🇮🇳 pic.twitter.com/vkTf6mxYUu
— Rajinikanth (@rajinikanth) October 24, 2021
Comments
Please login to add a commentAdd a comment