దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'రతన్ టాటా' (Ratan Tata) వ్యాపార రంగంలో మాత్రమే కాకుండా.. దాతృత్వంలో కూడా తనకు తానే సాటి. ఈయన చేసిన సేవలకుగానూ ఇటీవల ప్రతిష్టాత్మకమైన 'పీవీ నరసింహారావు స్మారక అవార్డు' లభించింది. దీనికి సంబంధించిన ఫోటోలను టాటా మోటార్స్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది.
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు మీద అందించే ఈ స్మారక పురస్కారం.. సామాజిక సంక్షేమం, మానవతా దృక్పథం పట్ల అసాధారణమైన అంకితభావాన్ని ప్రదర్శించిన వ్యక్తులకు అందిస్తారు. ఈ అవార్డు మార్చి 15న ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో రతన్ టాటా పొందారు.
బిలియన్ల కొద్దీ విరాళాలు ఇచ్చిన పారిశ్రామికవేత్తల్లో రతన్ టాటా ఒకరు. టాటా ట్రస్ట్‌ల కింద వ్యక్తిగత స్థాయిలో లక్షల రూపాయల విరాళాలు అందించారు. రతన్ టాటా ఆరోగ్య సంరక్షణ, విద్య, గ్రామీణాభివృద్ధి సహా వివిధ రంగాలకు విరివిగా విరాళాలు అందించారు. కాగా తాజాగా ఈయన పెంపుడు జంతువుల కోసం రూ. 165 కోట్లు వెచ్చించి టాటా ట్రస్ట్స్ స్మాల్ యానిమల్ హాస్పిటల్ పేరుతో హాస్పిటల్ నిర్మించారు.
ప్రస్తుతం రతన్ టాటా.. టాటా గ్రూప్ ఎమెరిటస్ చైర్మన్‌గా ఉన్నారు. ఇప్పటికే ఈయన భారతదేశ అత్యుత్తమ పురస్కారాలైన పద్మవిభూషణ్ (2008), పద్మభూషణ్ (2000) పొందారు. కాగా ఇప్పుడు పీవీ నరసింహారావు స్మారక అవార్డును సొంతం చేసుకున్నారు.
Our Chairman Emeritus Mr. Ratan Tata was honoured with the prestigious PV Narasimha Rao Memorial award for his immense contributions in the field of philanthropy. pic.twitter.com/uow3Qv0XOG
— Tata Group (@TataCompanies) March 19, 2024
Comments
Please login to add a commentAdd a comment