Rupert Murdoch Calls Off Engagement With Ann Lesley Over Religious Issues - Sakshi
Sakshi News home page

Rupert Murdoch: లేటు వయసులో ఘాటు ప్రేమ.. మతాల కారణంగా ముగిసిపోయింది..

Published Wed, Apr 5 2023 2:44 PM | Last Updated on Wed, Apr 5 2023 3:15 PM

rupert murdoch calls off engagement over religious issues - Sakshi

92 ఏళ్ల రూపెర్ట్ ముర్డోచ్‌, 66 ఏళ్ల ఆన్ లెస్లీ స్మిత్‌ల ప్రేమ కథ ముగిసిపోయింది. మతాల కారణంగా వారి నిశ్చితార్థం ఆగిపోయింది. ఇటీవలే ప్రేమలో పడిన ఆ వృద్ధ ప్రేమికుల పెళ్లికి అడ్డంకులు తప్పలేదు. వచ్చే వేసవి పెళ్లి చేసుకోవాలని భావించిన ఆ జంట నిశ్చితార్థం కూడా కాకుండానే విడిపోయింది.   

రూపెర్ట్ ముర్డోచ్‌ ప్రముఖ మీడియా సంస్థల అధినేత. ఫాక్స్‌ న్యూస్‌, న్యూస్‌ కార్ప్‌, స్కై న్యూస్‌ వంటి వార్తా సంస్థలను ఆయన స్థాపించారు. ఇక ఆన్ లెస్లీ స్మిత్‌ రేడియో హోస్ట్, మాజీ దంత వైద్యురాలు. వానిటీ ఫెయిర్ పత్రిక కథనం ప్రకారం.. స్మిత్ అవలంభిస్తున్న మతాచారాలతో ముర్డోచ్‌కు పొసగడం లేదు. దీంతో ఆమెతో ప్రేమకు స్వస్తి చెప్పి నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు.

వీరి ప్రేమాయణం 2022 సెప్టెంబర్ లో ప్రారంభమైంది. తన నాల్గవ భార్య జెర్రీ హాల్ నుంచి విడాకులు తీసుకున్న వెంటనే ముర్డోచ్ 2023 మార్చిలో స్మిత్‌తో తన నిశ్చితార్థాన్ని ప్రకటించాడు. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రేమలో పడటానికి భయపడ్డాను కానీ ఇది తన చివరి ప్రేమ అని ముర్డోచ్‌ తన యాజమాన్యంలోని న్యూయార్క్ పోస్ట్‌తో అప్పట్లో చెప్పారు. సెయింట్ పాట్రిక్స్ డే రోజున తాను స్మిత్‌కు ప్రపోజ్ చేశానని, ఆ సందర్భం తనను ఆందోళనకు గురి చేసిందని కూడా పేర్కొన్నారు.

ఈ జంట జనవరిలో బార్బడోస్‌లో హాలిడేలో కనిపించారు. స్మిత్ సముద్రం నుంచి షర్ట్‌లెస్ ముర్డోచ్‌కి సహాయం చేస్తున్నట్లు ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఫిబ్రవరిలో ముర్డోచ్‌ సెంట్రల్ పార్క్ సౌత్‌లో  30 మిలియన్‌ డాలర్లు, 6,500 చదరపు అడుగుల భారీ నివాసాన్ని కొనుగోలు చేయబోతున్నారని వార్తలు వచ్చాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement