religious differences
-
పాపం ముర్డోచ్ ఐదో పెళ్లి ఆగిపోయింది..
92 ఏళ్ల రూపెర్ట్ ముర్డోచ్, 66 ఏళ్ల ఆన్ లెస్లీ స్మిత్‌ల ప్రేమ కథ ముగిసిపోయింది. మతాల కారణంగా వారి నిశ్చితార్థం ఆగిపోయింది. ఇటీవలే ప్రేమలో పడిన ఆ వృద్ధ ప్రేమికుల పెళ్లికి అడ్డంకులు తప్పలేదు. వచ్చే వేసవి పెళ్లి చేసుకోవాలని భావించిన ఆ జంట నిశ్చితార్థం కూడా కాకుండానే విడిపోయింది. రూపెర్ట్ ముర్డోచ్ ప్రముఖ మీడియా సంస్థల అధినేత. ఫాక్స్ న్యూస్, న్యూస్ కార్ప్, స్కై న్యూస్ వంటి వార్తా సంస్థలను ఆయన స్థాపించారు. ఇక ఆన్ లెస్లీ స్మిత్ రేడియో హోస్ట్, మాజీ దంత వైద్యురాలు. వానిటీ ఫెయిర్ పత్రిక కథనం ప్రకారం.. స్మిత్ అవలంభిస్తున్న మతాచారాలతో ముర్డోచ్‌కు పొసగడం లేదు. దీంతో ఆమెతో ప్రేమకు స్వస్తి చెప్పి నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. వీరి ప్రేమాయణం 2022 సెప్టెంబర్ లో ప్రారంభమైంది. తన నాల్గవ భార్య జెర్రీ హాల్ నుంచి విడాకులు తీసుకున్న వెంటనే ముర్డోచ్ 2023 మార్చిలో స్మిత్‌తో తన నిశ్చితార్థాన్ని ప్రకటించాడు. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రేమలో పడటానికి భయపడ్డాను కానీ ఇది తన చివరి ప్రేమ అని ముర్డోచ్ తన యాజమాన్యంలోని న్యూయార్క్ పోస్ట్‌తో అప్పట్లో చెప్పారు. సెయింట్ పాట్రిక్స్ డే రోజున తాను స్మిత్‌కు ప్రపోజ్ చేశానని, ఆ సందర్భం తనను ఆందోళనకు గురి చేసిందని కూడా పేర్కొన్నారు. ఈ జంట జనవరిలో బార్బడోస్‌లో హాలిడేలో కనిపించారు. స్మిత్ సముద్రం నుంచి షర్ట్‌లెస్ ముర్డోచ్కి సహాయం చేస్తున్నట్లు ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఫిబ్రవరిలో ముర్డోచ్ సెంట్రల్ పార్క్ సౌత్‌లో 30 మిలియన్ డాలర్లు, 6,500 చదరపు అడుగుల భారీ నివాసాన్ని కొనుగోలు చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. -
ప్రమాదకర పోకడలు
ఇది భగత్ సింగ్ బలిదానం చేసిన మాసం. తమకు కంటి నిండా కునుకు లేకుండా చేసినందుకు కక్ష బూని 23 ఏళ్ల చిరుప్రాయంలోనే ఈ వీరుణ్ణి పరాయి పాలకులు చిదిమేశారు. మరణశిక్ష కోసం ఎదురుచూస్తూ జైల్లో గడిపినప్పుడు దేశంలో సాగుతున్న మత ఘర్షణల సంగతి విని ఆయన ఎంతో ఆవేదనతో చెప్పిన మాటలు ఇప్పటికీ అందరూ స్మరించుకోదగ్గవి. ‘వర్తమాన స్థితిగతులను చూస్తుంటే ఈ దేశం ఏమైపోతుందోనన్న ఆవేదన కలుగుతోంది. నా కళ్ల వెంట రక్తాశ్రువులు స్రవిస్తున్నాయి’ అని ఆయన అన్నాడు. మన ఇల్లు, మన చదువు మనకు వివేకం నేర్పించలేనప్పుడు కనీసం భగత్ సింగ్ వంటి నిష్కళంక దేశభక్తుల పలుకులైనా స్ఫురణకు రావాలి. కానీ ఇతరత్రా రోజుల మాట అటుంచి ఆయన బలిదానం చేసిన మాసంలోనైనా కొందరికి యుక్తాయుక్త విచక్షణ ఉండటం లేదని కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. కర్ణాటకలో ఆలయ పరిసరాల్లో అన్య మతస్తుల దుకాణాలుండటానికి వీల్లేదని హిందూత్వ సంఘాలు వీరంగం వేస్తుంటే... కేరళలో ఒక దేవస్థానం బోర్డు హైందవేతర మహిళన్న కారణంతో ఒక భరతనాట్య కళాకారిణి ప్రదర్శనను అడ్డుకుంది. దుకాణదారులను మతం ప్రాతిపదికన దూరంపెట్టే పోకడల్లో తాము జోక్యం చేసుకోలేమని సాక్షాత్తూ ప్రభుత్వమే కర్ణాటక అసెంబ్లీలో భగత్‌సింగ్ వర్ధంతి రోజున ప్రకటించింది. ఆ మర్నాటినుంచి హిందూత్వ సంస్థలు మరింతగా రెచ్చిపోయాయి. దక్షిణ కన్నడ జిల్లాలో మొదలైన ఈ తంతు రాష్ట్రమంతా విస్తరిస్తోంది. కేరళలో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ సర్కారుంది. అక్షరాస్యతలో ఆ రాష్ట్రం అగ్రభాగాన ఉంది. కానీ మత వివక్ష మాత్రం అక్కడ రాజ్య మేలుతోంది! ఈ దేశ చరిత్ర తిరగేస్తే తమ తమ మత విశ్వాసాలు ఏమైనప్పటికీ సాధారణ పౌరు లంతా సామరస్యంతో, సుహృద్భావంతో మెలగడం కనబడుతుంది. ఒకరి పండుగల్లో మరొకరు పాల్గొనడం, ఊరేగింపులు, ఉత్సవాల్లో భాగస్తులు కావడం దర్శనమిస్తుంది. ఈ ఆచరణలో నుంచే మన రాజ్యాంగంలోని సెక్యులర్ భావనలు మొగ్గతొడిగాయి. రాజ్యాంగ నిర్ణాయక సభలోని సభ్యుల్లో అత్యధికులు అన్ని ఒత్తిళ్లనూ అధిగమించి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు ప్రాతిపదికగా ఈ రాజ్యాంగాన్ని రూపొందించారు. కానీ రాజకీయ పక్షాల నాయకులు, పాలకుల్లో కొందరు దీనికి తూట్లు పొడిచే దురాలోచన చేస్తున్నారు. అన్య మతస్తులపై లేనిపోని నిందలు మోపి, పరమత విద్వేషాలను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను విడదీసి తమ అధికారం శాశ్వతం చేసుకోవాలని కలగంటున్నారు. ఇది ఆందోళన కలిగించే పరిణామం. కర్ణాటకలో హిజాబ్ వివాదం రేపి నెల్నాళ్లు దాటింది. ఆ వివాదం పర్యవసానంగా వేలాదిమంది ముస్లిం బాలికల చదువులు ఆగిపోయాయి. వార్షిక పరీక్షలు రాద్దామనుకునే సమయానికి ఈ అనవసర వివాదాన్ని సృష్టించడం వల్ల వారికి ఏడాది చదువూ వృధా అయింది. తమ చర్యలు బేటీ పఢావో, బేటీ బచావో స్ఫూర్తికి విరుద్ధమైనవని కూడా అక్కడి పాలకులకు తోచలేదు. ఆ వివాదం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగానే ఇప్పుడు చిరు వ్యాపారులను మత ప్రాతిపదికన వేరు చేసి కొందరికి అవకాశాలు నిరాకరిస్తున్నారు. కర్ణాటకలో మార్చి మొదలుకొని మే నెల వరకూ వివిధ ఆలయాల్లో జాతరలు జరుగుతాయి. ఇందులో వేలాదిమంది భక్తులు పాల్గొంటారు. అలాంటి సమ యాల్లో వివిధ రకాల వస్తువులు అమ్మి లాభపడదామని ఎవరైనా ఆశిస్తారు. కానీ చాలా ఆలయాలు ముస్లిం దుకాణదారులకు డిపాజిట్లు వెనక్కిస్తున్నాయి. హిందూత్వ సంస్థల ఒత్తిళ్లతో ఇలా చేయక తప్పడం లేదని ఆలయ నిర్వాహకులు తమకు చెబుతున్నారని ముస్లింలు అంటుండగా, వారు స్వచ్ఛందంగా డిపాజిట్లు వెనక్కి తీసుకుంటున్నారని ఆలయాల బాధ్యులు చెబుతున్నారు. ఇలాంటి భయానక వాతావరణానికి దోహదపడినందుకు కాస్తయినా సిగ్గుపడాలన్న ఇంగిత జ్ఞానం పాలకు లకు లేదు. ఈ మతిమాలిన ఆలోచనలపై సొంత పార్టీలోనే అసమ్మతి స్వరాలు వినబడటం బీజేపీలో కనిపిస్తున్న సరికొత్త పోకడ. ముస్లిం దుకాణదారులపై నిషేధం విధించడం పిచ్చితనమని పార్టీ సీనియర్ నాయకుడు హెచ్ విశ్వనాథ్, పార్టీ శాసనసభ్యుడు అనిల్ బెనకే విమర్శించారు. దేశంలో ఇంకా ప్రజాస్వామ్య స్ఫూర్తి అంతో ఇంతో మిగిలి ఉన్నదని ఇలాంటి స్వరాలు భరోసా ఇస్తాయి. మన దేశ పౌరులు కోట్లాదిమంది తమ మత విశ్వాసాలు ఏమైనప్పటికీ ప్రపంచ దేశాల్లో స్వేచ్ఛగా వ్యాపార వ్యవహారాలు సాగిస్తున్నారు. చదువులు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారు. అసంబద్ధ ఆలోచనలు చేసేవారికి ఈ వాస్తవాలు కూడా అర్థమ వుతున్నట్టు లేదు. కేరళలో భరతనాట్య కళాకారిణి మాన్సియా జన్మతహా ముస్లిం. భరతనాట్యంలో మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ చేసిన మాన్సియా ఆ విశ్వవిద్యాలయానికే టాపర్‌గా నిలిచారు. ఆమె, ఆమె సోదరి భరతనాట్యాన్ని అభ్యసించడం ద్వారా మత విరుద్ధమైన పోకడలు పోతున్నారని ముస్లిం మత పెద్దలు ఆగ్రహించి చాన్నాళ్ల క్రితమే ఆ కుటుంబాన్ని వెలివేశారు. ఇన్నాళ్లకు హిందూ ఛాందసులు కూడా అదే బాటలో ఆమెకు అవకాశాన్ని నిరాకరించారు. తాను హిందువును పెళ్లాడిన వైనాన్నీ,ప్రస్తుతం హేతువాదిగా ఉంటున్న వాస్తవాన్నీ చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ‘మతములన్నియు మాసిపోవును.. జ్ఞానమొక్కటె నిలిచి వెలుగును’ అన్నాడు మహా కవి గురజాడ. కానీ కాలం గడుస్తున్నకొద్దీ మన అజ్ఞానం ఊడలు వేస్తున్న ధోరణులు కనబడు తున్నాయి. ఇది ప్రమాదకరం. -
True Love Story: 65 ఏళ్ల ఎదురుచూపు.. అద్భుత ప్రేమ గాథ!
ప్రేమకు చావు లేదు. అది అజరామరం అంటారు. ప్రేమలో ప్రేమతప్ప ధ్వేషభేషజాలు అస్సలుండవు. దీనిని రుజువుచేసే ఎందరో వీర ప్రేమికులను చరిత్రలో చూశాం కూడా. అవన్నీ పిచ్చి ప్రేమలని కొట్టి పారేయలేం కూడా. ఎందుకంటే ఆయా గాథల్లో రాతిని కూడా చలింపచేయగల శక్తి ఉంటుంది. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ప్రేమికుల ప్రేమ కథ కూడా అటువంటిదే! ఈనాటి ప్రేమ కూడా కాదండోయ్! 1911 నాటి ప్రణయగాథ.. మొదలెడదామా.. పెర్లె స్క్వార్జ్, మాక్స్ వెల్ అనుకోకుండా ఒక కంట్రీ క్లబ్లో కలిశారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారే.. వీళ్లది కూడా అటువంటి ప్రేమే. తొలిచూపులోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. వాళ్లకే తెలీకుండా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఇరు కుటుంబాల్లో విషయం చెప్పారు. ఇరువురి మతాలు వారి పెళ్లికి అడ్డుపడ్డాయి. తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. కుటుంబ పరువు కోసం ఆజన్మాంతం ప్రేమికులుగానే మిగిలిపోయారు. చదవండి: 150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !! తర్వాత మ్యాక్స్‌వెల్ నావీలో జాయిన్ అయ్యాడు. ఎమ్ఏ, ఎమ్బీఏలు పూర్తి చేసి, కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పీహెచ్డీ సంపాదించాడు. అదే యూనివర్సిటీలో చరిత్ర బోధించాడు. తర్వాత వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో అమెరికన్ వలసరాజ్య చరిత్ర ప్రొఫెసర్‌గా పనిచేశాడు. అనేక పరిశోధన పత్రాలను ప్రచురించాడు. కొన్ని పుస్తకాలు కూడా రాశాడు. 83 సంవత్సరాల వయస్సులో 1979 లో మరణించాడు. పెర్లె మాత్రం చనిపోయేవరకు ప్రియుడికోసం ఎదురుచూస్తూనే ఉంది. పేరెంట్స్ ఆమెను అతని దగ్గరికి పోనివ్వలేదు. 65 యేళ్ల వరకు పెర్లీ నిశ్శబ్ద జీవితాన్ని గడిపింది. మ్యాక్స్ మరణం గురించి విన్న 3 నెలల తర్వాత ఆమె 1980లో కన్నుమూసింది. చదవండి: Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్ నిజాలు! ఆనాటి ప్రేమతాలూకు ఆనవాళ్లు తాజాగా ఒక ఇంట్లో ఉత్తరాల రూపంలో బయటపడ్డాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందల కొద్దీ ఉత్తరాలు. పెర్లె నివసించిన ఆ ఇంట్లో అటకపై ఒక పెట్టెలో మాక్స్ అనే వ్యక్తి నుంచి వచ్చిన ప్రేమలేఖలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. చూస్తే అందులోని విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. దాదాపు 1913-1978 వరకు మాక్స్,పెర్లేకి రాసిన ఉత్తరాలవి. అతని లేఖలన్నీ “మై స్వీట్ పెర్ల్” తో ప్రారంభమై.. “ఫరెవర్ యువర్స్.. మాక్స్” తో ముగిశాయి. విధి వాళ్లని కలపనప్పటికీ.. వారు మాత్రం తమ జీవితాంతం ఒకరికొకరు ఉత్తరాలు రాయడం కొనసాగించినట్లు ఆ లేఖలను బట్టి తెలుస్తోంది. ఐతే మాక్స్ నుండి వచ్చిన ఉత్తరాలు మాత్రమే దొరికాయి. పెర్లె రాసిన ఉత్తరాలు దొరకలేదు. ఆఫ్రికా, స్పెయిన్, చిలీ, కెనడా, వాషింగ్టన్, రోడ్ ఐలాండ్, ఫ్రాన్స్‌ల నుండి పెర్లెకి ఉత్తరాలు వచ్చాయి. అతను ఎక్కడికి వెళ్లినా, ఎక్కడున్నా ... ఉత్తరాలు మాత్రం రాస్తూనే ఉండేవాడు. ఇవి ప్రత్యుత్తరాలు అని లేఖల కంటెంట్ తెల్పుతుంది. ఈ విధంగా వాళ్లిరువురు 65 సంవత్సరాలకు పైగా ఉత్తర ప్రత్యుత్తరాలను కొనసాగించినట్లు తెలుస్తోంది. చివరికి మాక్స్ వివాహం చేసుకున్నడని, అతనికి మిచెల్ అనే ఒక కూతురు కూడా ఉన్నట్లు ఆ లేఖలను బట్టి తెలుస్తోంది. ఐతే ఉత్తరాల్లో దాని గురించి ఎక్కువ సమాచారం లేదు. చదవండి: రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు! 1980లో పెర్లే మరణించినప్పుడు ఆమె దాచుకున్న మాక్స్ ఉత్తరాల్లో కొన్ని కాలిపోయాయట. ఆమె కుటుంబం ఆ ఉత్తరాలన్నింటినీ అటకపై ఒక బాక్స్‌లో భద్రపరిచింది. గొప్ప ప్రేమ కథలలో ఒకటి ఉత్తరాల రూపంలో తాజాగా బయటపడింది. ‘ఐ లవ్యూ.. ఇంకేం చెప్పలేను- మాక్స్’ (మతం మారితేనే పెళ్లి చేసుకోవచ్చని పెర్లే చెప్పిన తర్వాత మాక్స్ ఆమెకు రాసిన మొదటి ఉత్తరం ఇది). తదుపరి అక్షరాలు పోస్ట్‌మార్క్ చేసిన ఎన్వలప్లలో ఉన్నాయి. ‘సోమవారం సాయంత్రం నాకు అర్థమైంది. నేను మొదటి నుండి అర్థం చేసుకున్నాను. నువ్వేం అనుకుంటున్నావనేదే అర్థం కావడంలేదు. ఇకపై క్లబ్‌కి రాలేను. నిన్ను ప్రేమిస్తున్నందుకు నాకు అర్థం అయ్యే హింసను నేను అనుభవించలేను. నీ దగ్గర ఉండడం, నిన్ను చూడడం, నువ్వు అని అనిపించడం నేను తట్టుకోలేకపోయాను... (మిగిలిన ఉత్తరం చిరిగిపోయింది) ఇది పెర్లె, మాక్స్‌కు రాసిన ఉత్తరం. ‘మనం కలిసి ఉండలేమని చెప్పిన తర్వాత నాకు వచ్చిన మొదటి లేఖ’ అని కవరుపై రాసివుంది (పెర్లే రాసిన లేఖ గురించి మాక్స్ రాసుకున్న అక్షరాలవి) ఎంత అందమైన ప్రేమ కథ ఇది. చదవండి: Mystery Case: ఐదేళ్ల క్రితం హత్యచేశారు.. కానీ.. -
ప్రోత్సాహకం ఏదీ!
‘ఆదర్శ దంపతుల’కు మొండిచెయ్యి ⇒ నిధుల మంజూరులో పాలకుల నిర్లక్ష్యం ⇒ ఏళ్ల తరబడి 90 జంటల ఎదురు చూపులు ⇒ బీసీ సంక్షేమ శాఖలో పెరిగిపోయిన దరఖాస్తులు ⇒ ఉన్నతాధికారులకు నివేదించినా ఫలితం లేదు ఇందూరు : శ్రావణ్, సౌమ్య పెద్దలను ఎదిరిం చి, కట్టుబాట్లను వదులుకుని కులాం తర వివాహం చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వం అందించే ప్రోత్సాహక బహుమ తి కోసం 2009లో బీసీ సంక్షేమ శాఖకు దరఖాస్తు చేసుకున్నా రు. ప్రస్తుతం ఆ దంపతులకు సంతానం కలిగి అమ్మా, నాన్నలయ్యారు. పుట్టిన పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. నేడో రేపో స్కూల్‌కు కూడా వెళ్లే వయస్సు కూడా వచ్చేస్తోంది. నే టి వరకూ ఆ దంపతులకు ప్రభుత్వం నుంచి కులాంతర వివాహ ప్రోత్సాహక బహుమతిని అందజేయలేదు. వచ్చే రూ. పదివేలు ఆసరాగా ఉం టాయనుకున్న ఆ దంపతులు నిధుల కోసం జిల్లా బీసీ సంక్షేమ శాఖ చుట్టూ తిరిగిన సంద ర్భాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిని ఈ ఒక్క జంటే కాదు. ప్రోత్సాహకం కోసం దరఖాస్తు చేసుకున్న 90 జంటలూ ఎదుర్కొంటున్నాయి. అరకొర విదిలింపులు కులాంతర వివాహాలు చేసుకున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కుల, మత భేదాలు లేకుండా ఆదర్శ వివాహా లు చేసుకున్న దంపతులకు నగదు బహుమతులు అందజేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అమలులో మాత్రం పూర్తిగా విఫలమైంది. దీంతో ఆ జంటల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ముఖ్యంగా బీసీల పరిస్థితి దారుణంగా ఉంది. ఆదర్శ వివాహాలు చేసుకున్న దంపతులు ప్రభుత్వం అందిం చే పోత్సాహక బహుమతి కోసం 2009లో జిల్లా బీసీ సంక్షేమ శాఖలో దరఖాస్తులు చేసుకున్నా ఇప్పటి వరకూ అందలేందటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. నిధులు ఇస్తున్నాం అన్నట్లుగా సంవత్సరానికి రూ.20 వేలు మంజూరు చేస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. ఈ నిధులు కేవలం రెండు జంటలకు మాత్రమే సరిపోతారుు. మిగతా జంటలకు నిరాశే మిగులుతోంది. ఏటా పెరుగుతున్న అర్జీలు ఏటా బీసీ సంక్షేమ శాఖకు 20 నుంచి 30 దరఖాస్తులు అందుతున్నాయి. సంవత్సరానికి రెండు జంటలకు సరిపోయే నిధులివ్వడంతో తదుపరి దంపతులు సంవత్స రాల తరబడి వేచి చూడటం తప్పడం లేదు. జిల్లాలో 2009 నుంచి నేటి వరకూ కలిపి మొత్తం 90 జంటలు దరఖాస్తులు చేసుకున్నాయి. నిధులు వస్తే దేనికైనా ఉపయో గపడుతాయనే ఉద్దేశంతో బీసీ సంక్షేమ శాఖ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. సమాధానాలు చెప్పలేని అధికారులు నిధులు వస్తే సమాచారం ఇస్తాం అని విసుక్కుం టున్నారు. 2012-13 సంవత్సరానికిగాను ప్రభుత్వం రూ.40 వేలను జిల్లాకు మంజూరు చేయగా, వాటిని సీనియార్టీ ప్రకారం ఉన్న నాలుగు జంటలకు అందజేశారు. ప్రస్తుతం రూ.80 లక్షలు అవసరం. ఈ నిధులను విడుదల చేయాలని గత రెండు, మూడు సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని, సంబంధిత శాఖ ఉన్నతాధికారులను లేఖల ద్వా రా కోరినా ఫలితం కనబడలేదు. గత నెలలో జిల్లా పరిషత్ స్థాయి సంఘా సమావేశాలలో సైతం తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. బీసీ సంక్షేమ శాఖల దరఖాస్తులు కుప్పలుగా పడి ఉంటున్నాయే తప్పా పరిష్కారం లభించడం లేదు. పెళ్లి చేసుకున్న ఇద్దరు కాస్త సంతానంతో ముగ్గురు, నలుగురిగా మారినా ప్రభుత్వం నుంచి పా రితోషకం అందకపోవడం శోచనీయకరమైన విషయమని బాధిత జంటలు వాపోతున్నారుు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలోనైనా తమకు అందాల్సిన ప్రోత్సహకం అందిస్తే సంతోసిస్తామంటున్నారు. నిధుల కోసం వేచి చూస్తున్నాం కులాంతర వివాహాలు చేసుకున్న బీసీ జంటలకు చాలా సంవత్సరాలు గా ప్రభుత్వం నుంచి నగదు ప్రోత్సహకం అందటం లేదు. ప్రభుత్వం ఏ టా రూ.20వేలు మాత్ర మే మంజూరు చేస్తోంది. అవి ఇద్దరికి మాత్ర మే సరిపోతున్నాయి. మిగతా వారికి అన్యాయం జరగుతోంది. దరఖాస్తుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. అ యితే, 90 జంట లకు రావాల్సిన నిధుల కోసం ప్రభుత్వాలకు, ప్రజాప్రతినిధులకు, జి ల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులకు చాలాసార్లు విన్నవించాం. చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేశాం. చివరికి ప్రతీ నెలా హైదరాబాద్‌లో జరుగుతున్న ఉన్నతాధికారులు సమీక్షలో కూడా విషయాన్ని తెలుపుతున్నాం. -విమలాదేవి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి