ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడంతో అమెరికాతో పాటుగా పలు దేశాలు ప్రపంచ చరిత్రలోనే అత్యంత కఠినమైన ఆంక్షలను రష్యాపై విధించాయి. ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన ఆంక్షలు రష్యా ఆర్ధిక వ్యవస్థ గుదిబండగా మారాయి. ఈ సందర్భంగా రష్యా ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర వ్యాఖ్యలను చేశారు.
మీ కరెన్సీ ఒక పెన్నీ విలువ కూడా చేయదు..!
పలు దేశాలు రష్యాపై భారీ ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. ప్రపంచంలో రష్యాను ఏకాకిగా నిలిపేందుకు అమెరికా అనేక ప్రయత్నాలను చేస్తోంది. ఆంక్షలతో రష్యా ఆర్థిక వ్యవస్థ పాతాళానికి పడిపోయిందని బైడెన్ విమర్శించారు. అంతేకాకుండా రష్యా కరెన్సీ విలువ రూబెల్ విలువ ఏకంగా 50 శాతానికి పైగా పతనమైందని గుర్తుచేశారు. రష్యన్ కరెన్సీ ఒక పెన్నీ విలువ కూడా చేయదంటూ తీవ్ర వ్యాఖ్యలను చేశారు.
దిగుమతులపై నిషేధం..!
ప్రపంచంలో క్రూడ్ ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తోన్న దేశాల్లో రష్యా మూడో స్థానంలో ఉంది. అన్ని విధాలుగా రష్యాపై ఆంక్షలు విధించేందుకు బైడెన్ సిద్దమయ్యారు. తాజాగా రష్యా నుంచి గ్యాస్, ముడి చమురు దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు జో బైడెన్ ప్రకటించారు. చమురు దిగుమతులపై నిషేధం విధించడం ద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వెల్లడించారు. రష్యా ఆర్థిక వ్యవస్థను అంటరానిదని అన్నారు. ఇక రష్యన్ రూబెల్‌ను డాలర్‌తో పోల్చితే ఎన్నడూ లేనంతగా గణనీయంగా పడిపోయింది.
చదవండి: రష్యా దెబ్బకు ఆ దేశాలు ఉక్కిరిబిక్కిరి..! రంగంలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్...!
Comments
Please login to add a commentAdd a comment