న్యూఢిల్లీ: సెబీ వద్ద రూ.24,000 కోట్ల సహారా డిపాజిట్లు నిరుపయోగంగా పడి ఉన్నాయని.. మరింత డిపాజిట్ చేయాలని కోరడం సమంజసం కాదని సహారా గ్రూపు పేర్కొంది. తొమ్మిదేళ్లుగా ఈ మొత్తం సెబీ వద్దే ఉండిపోవడం సహారా గ్రూపు వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించింది.
సుప్రీం ఆదేశాలు..
సెబీ చైర్మన్ అజయ్‌త్యాగి మంగళవారం మాట్లాడుతూ.. 2012 ఆగస్ట్‌నాటి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సహారా గ్రూపు పూర్తిగా డిపాజిట్ చేయాల్సి ఉందన్నారు. మొత్తం రూ.25,781 కోట్ల డిపాజిట్‌లకు గాను రూ.15,000 కోట్లే డిపాజిట్ చేసినట్టు చెప్పారు. కానీ సెబీ 2020–21 వార్షిక నివేదిక ప్రకారం సహారా డిపాజిట్‌దారులకు సెబీ రూ.129 కోట్లే చెల్లింపులు చేయగలిగింది. రూ.23,000కోట్లకు పైగా డిపాజిట్లు సెబీ ఎస్క్రో ఖాతాలోనే ఉన్నాయి అని చెప్పారు.
సహారా స్పందన
త్యాగి వ్యాఖ్యలపై సహారా గ్రూపు స్పందిస్తూ.. సుప్రీం కోర్టు అసలు, వడ్డీ మొత్తం కట్టాలని చెప్పింది, ప్రతి డిపాజిటర్‌కు చెల్లింపులు చేయాలన్న ఉద్దేశ్యంతోనే. కానీ, చెల్లింపులకు సంబంధించిన క్లెయిమ్‌లు చాలా తక్కువ ఉన్నట్టు మూడు నెలల అనంతరం సుప్రీంకోర్టు సైతం పరిగణనలోకి తీసుకుంది. కనుక సహారా గ్రూపు మరింత డిపాజిట్ చేయాలన్న సెబీ ప్రకటన తప్పు’’ అంటూ సహారా గ్రూపు ప్రకటన విడుదల చేసింది. సెబీ నాలుగు పర్యాయాలు దేశవ్యాప్తంగా 154 వార్తా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినా కానీ, కేవలం రూ.129 కోట్లే డిపాజిటర్లకు చెల్లింపులు చేసినట్టు గుర్తు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment