స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..! | Sensex loses 68 points, Nifty Holds 17000 on Feb 23rd | Sakshi
Sakshi News home page

స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!

Published Wed, Feb 23 2022 4:12 PM | Last Updated on Wed, Feb 23 2022 4:12 PM

Sensex loses 68 points, Nifty Holds 17000 on Feb 23rd - Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం 3 తర్వాత ఒక్కసారిగా కుప్పకులాయి. గత కొద్ది రోజుల నుంచి నష్టాల్లో కొనసాగడంతో కనిష్ట ధరల వద్ద షేర్లను కొనుగోలు చేయాలని చూసిన రష్యా - ఉక్రెయిన్ మధ్య నెలకొన్న సంక్షోభం వల్ల చివరలో కొద్దిగా వెనక్కి తగ్గారు. దీంతో రోజంతా లాభాల్లోనే ఉన్నా.. మార్కెట్ మధ్యాహ్నం 3 గంటల అనంతరం ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకుంది.

ముగింపులో, సెన్సెక్స్ 68.62 పాయింట్లు(0.12%) క్షీణించి 57,232.06 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 28.95 పాయింట్లు(0.17%) క్షీణించి 17,063.25 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.59 వద్ద ఉంది. కోటక్​ మహీంద్రా, టైటాన్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, మారుతీ సుజుకీ షేర్లు రాణిస్తే.. ఓఎన్​జీసీ, హీరో మోటోకార్ప్​, ఎన్​టీపీసీ, ఎల్​ అండ్​ టీ, జేఎస్​డబ్ల్యూ స్టీల్ షేర్లు​ డీలాపడ్డాయి. రియాల్టీ ఇండెక్స్​ 3 శాతం మేర పుంజుకుంది. ఆటో, ఐటీ రంగం షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనై.. చాలా వరకు నష్టాలు నమోదుచేశాయి.

(చదవండి: హైటెక్స్‌లో 26, 27 తేదీల్లో ఎస్‌బీఐ మెగా ప్రాపర్టీ షో..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement