ఇండియాలో రీఎంట్రీ ఇస్తున్న సూపర్‌ జంబో విమానం | Singapore Airlines Will Relaunch AirBus A380 Service | Sakshi
Sakshi News home page

ఎయిర్‌బస్‌ ఏ380 మళ్లీ భారత్‌ ఎంట్రీ

Published Sat, Dec 18 2021 1:02 PM | Last Updated on Sat, Dec 18 2021 1:06 PM

Singapore Airlines Will Relaunch AirBus A380 Service - Sakshi

ముంబై: ఎయిర్‌బస్‌ తయారీ ఏ380 సూపర్‌జంబో ఎయిర్‌క్రాఫ్ట్‌ మళ్లీ భారత్‌లో ఎంట్రీ ఇవ్వబోతోంది. ముంబై–సింగపూర్‌ మధ్య జనవరి 10 నుంచి.. ఢిల్లీ–సింగపూర్‌ మధ్య ఫిబ్రవరి 14 నుంచి ఈ భారీ విమానాన్ని నడపనున్నట్టు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. మహమ్మారి కారణంగా 20 నెలల క్రితం ఈ సర్వీసును నిలిపివేశారు.

నాలుగు తరగతుల్లో మొత్తం 471 మంది ప్రయాణికులు ఏ380 విమానంలో కూర్చునే వీలుంది. మెయిన్‌ డెక్‌లో 343 ఎకానమీ, 44 ప్రీమియం ఎకానమీ క్లాస్‌ సీట్స్‌ ఉంటాయి. అప్పర్‌ డెక్‌లో 6 సీట్స్, 78 బిజినెస్‌ క్లాస్‌ సీట్స్‌ ఉన్నాయి. ఏ380 సూపర్‌జంబో విమానాలను ప్రపంచంలో తొలుత సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ 2007లో ప్రవేశపెట్టింది.

చదవండి:ఆకాశంలో హార్ట్‌ టచింగ్‌ ప్రయాణం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement