దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:58 సమయానికి నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 25,078కు చేరింది. సెన్సెక్స్ 54 పాయింట్లు పుంజుకుని 81,882 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 103.25 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.69 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.04 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.76 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 1.01 శాతం దిగజారింది.
ఇదీ చదవండి: ‘స్మార్ట్’ ఉన్నా ఫీచర్ ఫోన్లను ఎందుకు కొంటున్నారు?
కెనడా, భారత్ మధ్య దౌత్యపరమైన సంబంధాలు తీవ్రస్థాయికి చేరాయి. నిజ్జర్ సింగ్ అనే ఖలిస్థానీను గతంలో కెనడాలో హత్య చేశారు. అందుకు భారత ప్రభుత్వం కారణమని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర విమర్శలు చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పడంతో ఇరు దేశాల మధ్య తీవ్ర దుమారం రేగింది. నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, ఆధారాలుంటే వెంటనే వెల్లడించాలని భారత్ చెప్పింది. ఈ పరిణామాలు ఇండియన్ ఈక్విటీ మార్కెట్లపై కొంత ప్రభావం చూపుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment