దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 32 పాయింట్లు తగ్గి 25,356 వద్దకు చేరింది. సెన్సెక్స్ 71 పాయింట్లు దిగజారి 82,890 వద్ద ముగిసింది. నిన్నటి మార్కెట్ సెషన్‌లో సూచీలు జీవితకాల గరిష్ఠాలను తాకాయి. మదుపర్లు ఈరోజు గరిష్ఠాల వద్ద అమ్మకాలవైపు మొగ్గు చూపారు.
సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్ ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, నెస్లే, ఎస్‌బీఐ, ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.
ఇదీ చదవండి: అన్నీ అవాస్తవాలే
అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, ఐటీసీ, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, పవర్‌గ్రిడ్, ఎల్ అండ్ టీ, హెచ్‌యూఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎం అండ్ ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment