దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ 56 పాయింట్లు లాభపడి 22,389కు చేరింది. సెన్సెక్స్ 224 పాయింట్లు పుంజుకుని 73,884 వద్ద ట్రేడవుతోంది.
రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 5.09 శాతంగా నమోదయ్యింది. గడచిన నాలుగు నెలల్లో ఇంత తక్కువ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న వాస్తవిక లక్ష్యానికి (ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతం) ఇంకా అధికంగా ఉన్నప్పటికీ.. నాలుగు నెలల కనిష్టానికి సూచీ దిగిరావడం గమనార్హం.
డాలర్ ఇండెక్స్ 103 పాయింట్లకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 82.09 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.15 శాతానికి చేరాయి.
సెన్సెక్స్ 30 సూచీలో ఐటీసీ, నెస్లే, విప్రో, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, భారతిఎయిర్‌టెల్, సన్‌ఫార్మా, హెచ్‌యూఎల్ షేర్లు నష్టాల్లో జారుకున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment