దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 67 పాయింట్లు లాభపడి 22,576కు చేరింది. సెన్సెక్స్ 207 పాయింట్లు పుంజుకుని 74,460 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 104.42 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 89.62 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.42 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.11 శాతం లాభాలతో ముగిసింది. నాస్‌డాక్ 1.24 శాతం ఎగబాకింది.
రష్యా తదితర అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలకూ ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇక ఇటీవల యూఎస్ డాలరుతో బలహీనంగా కదులుతున్న దేశీ కరెన్సీ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు.
యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్.. ఫండ్స్ రేట్లను యథాతథంగా నిలిపి ఉంచిన సంగతి తెలిసిందే. ఈ బాటలో దేశీయంగా సైతం ఆర్‌బీఐ ద్వైమాసిక పరపతి సమీక్షలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును ఏడోసారీ యథాతథంగా 6.5 శాతంవద్దే కొనసాగించేందుకు నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2024–25) జీడీపీ వృద్ధి రేటును 7 శాతంగా అంచనా వేసింది. సీపీఐ లక్ష్యాన్ని 4.5 శాతంగా పేర్కొంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment