దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:19 సమయానికి నిఫ్టీ 194 పాయింట్లు పెరిగి 24,336కు చేరింది. సెన్సెక్స్ 631 పాయింట్లు పుంజుకుని 79,733 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 103 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 81 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.91 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.6 శాతం, నాస్‌డాక్ 2.34 శాతం లాభపడ్డాయి.
ఇటీవల విడుదలైన రిటైల్ సేల్స్ డేటా, నిరుద్యోగిత రేటు మార్కెట్‌కు సానుకూలంగానే నమోదయ్యాయి. దాంతో సెప్టెంబర్‌లో రానున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో కనీసం 25 పాయింట్ల వరకు వడ్డీరేట్లును కట్ చేస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ అనుకున్న విధంగానే వడ్డీరేట్లను తగ్గిస్తే ఆర్‌బీఐతోపాటు ఇతర దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లలో కోత విధిస్తాయని అంచనా. ఇది మార్కెట్‌కు సానుకూలాంశంగా మారనుంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment