దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:38 సమయానికి నిఫ్టీ 55 పాయింట్లు పెరిగి 24,593కు చేరింది. సెన్సెక్స్ 109 పాయింట్లు పుంజుకుని 80,549 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 102.67 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 79.4 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.88 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో భారీ లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 3.9 శాతం, నాస్‌డాక్ 5.2 శాతం లాభపడ్డాయి.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ జులైలో నిర్వహించిన ద్రవ్య పాలసీ సమావేశ వివరాలు (ఫెడ్ మినిట్స్) 21న (బుధవారం) విడుదల కానున్నాయి. ఆర్థిక వ్యవస్థ సహా మందగిస్తున్న ధరల నేపథ్యంలో 2024 ద్వితీయార్ధంలో రేట్ల తగ్గింపునకు సంకేతాలిచ్చిన ఫెడ్ రిజర్వ్ సమావేశ అంతర్గత నిర్ణయాలు, అవుట్‌లుక్ వివరాలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుంది.
జపాన్ జూన్ మెషనరీ ఆర్డర్లు సోమవారం, యూరోజోన్ జులైన ద్రవ్యోల్బణ డేటా మంగళవారం, జపాన్ జులై వాణిజ్య లోటు గణాంకాలు బుధవారం వెల్లడి కానున్నాయి. మరుసటి రోజు గురువారం దేశీయ హెచ్‌ఎస్‌బీసీ తయారీ, సర్వీసెస్ పీఎంఐ గణాంకాలు వెల్లడి అవుతాయి. వారాంతాపు రోజైన శుక్రవారం జపాన్ జులై ద్రవ్యోల్బణ డేటా పాటు భారత ఆర్‌బీఐ ఫారెక్స్ నిల్వలు ప్రకటించనుంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment