దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక విధాన నిర్ణయం బుధవారం ప్రకటించనున్న నేపథ్యంలో మదుపరులు డేటా విడుదల ఎదురుచూస్తున్నారు. సెషన్ ప్రారంభ సమయానికి బీఎస్ఈ సెనెసెక్స్ 20 పాయింట్లు లేదా 0.02 శాతం క్షీణించి 82,968 వద్ద, నిఫ్టీ 50 0.01 శాతం క్షీణించి 25,382 వద్ద ఉన్నాయి.
సోమవారం నాటి సెషన్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) రూ.1,634.98 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐలు) రూ.754.09 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
మంగళవారం చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.18 శాతం పెరిగి 72.89 డాలర్లకు చేరుకోగా, యుఎస్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.43 శాతం పెరిగి 70.40 డాలర్లకు చేరుకుంది. స్పాట్ గోల్డ్ ధర 0.06 శాతం తగ్గి ఔన్స్‌కు 2,580.51 డాలర్లకు చేరుకుంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment