ఫండ్స్‌కు సెబీ ఆదేశాలు
ముంబై: విదేశీ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్)లలో ఇన్వెస్ట్ చేసేందుకు పెట్టుబడులను అనుమతించవద్దంటూ సెబీ తాజాగా దేశీ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్(యాంఫి)ను ఆదేశించింది. ఏప్రిల్ 1నుంచి తాజా ఆదేశాలు అమలుకానున్నాయి. కాగా.. ఎంఎఫ్‌లు విదేశీ సెక్యూరిటీల(షేర్లు)లో 7 బిలియన్ డాలర్లవరకూ ఇన్వెస్ట్ చేసేందుకు సెబీ అనుమతిస్తుంది. అయితే 2022 జనవరిలోనే గరిష్ట పరిమితికి చేరడంతో విదేశీ సెక్యూరిటీలలో ఎంఎఫ్ పెట్టుబడులకు ఇప్పటికే సెబీ చెక్ పెట్టింది.
ఈ బాటలో ప్రస్తుతం విదేశీ ఈటీఎఫ్‌లో పెట్టుబడులకు నో చెప్పింది. వెరసి ఇన్వెస్టర్ల నుంచి విదేశీ ఈటీఎఫ్‌ల కోసం పెట్టుబడులను అనుమతించవద్దంటూ ఎంఎఫ్‌లను ఆదేశించింది. దేశీయంగా 77 ఎంఎఫ్ పథకాలు విదేశీ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కాగా.. విదేశీ మార్కెట్లు దిద్దుబాటుకు లోనుకావడంతో ఎంఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) విలువ క్షీణించే అవకాశముంది. దీంతో ఆమేర పెట్టుబడులకు సెబీ 2023లో అనుమతించింది.
Comments
Please login to add a commentAdd a comment