
న్యూఢిల్లీ: ఒక అకౌంట్‌ను మోసపూరితమైనదిగా ప్రకటించేముందు సంబంధిత రుణ గ్రహీత తన వాదనను వినిపించుకునేందుకూ తగిన అవకాశం కల్పించాలని బ్యాంకింగ్‌కు అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఈ మేరకు 2020లో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం సమర్థించింది. (రూ. 40లక్షల లోపు ఇల్లు కావాలా? అనరాక్ రిపోర్ట్ ఎలా ఉందంటే..!)
ఒక ఖాతాను మోసపూరితంగా వర్గీకరించడం వల్ల ఆ నేర విచారణను దర్యాప్తు సంస్థలు చేపట్టడమే కాకుండా, అది ఇతర క్రిమినల్, సివిల్ చర్యలకూ దారితీస్తుందన్న విషయాన్ని అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది. ఖాతాను మోసపూరితమైనదిగా వర్గీకరించే చర్య.. రుణగ్రహీత వ్యాపారం, సద్భావనపై (గుడ్‌విల్) మాత్రమే కాకుండా కీర్తి ప్రతిష్టలను కూడా ప్రభావితం చేస్తుందని పేర్కొంది. సహజ న్యాయ సూత్రాల ప్రకారం రుణగ్రహీతలకు తప్పనిసరిగా నోటీసు అందించాలని, ‘మోసపూరితమైనదిగా ప్రకటించడానికి దారితీస్తున్న పరిస్థితులకు సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక లోని తీర్మానాలను వివరించడానికి అవకాశం ఇవ్వాలని సుప్రీం సూచించింది.
(ఇదీ చదవండి: 7 నెలల పసికూన: దిగ్గజాలను ఢీకొంటోంది!)
‘‘తన అకౌంట్‌ను నేరపూరితమైనదిగా ప్రకటించడం కూడదని రుణగ్రహీత విజ్ఞప్తిచేస్తే, ఆ అభ్యంతరాలను తోసిపుచ్చాల్సిన పరిస్థితుల్లో... అందుకు సంబంధించి సహేతుకమైన ఉత్తర్వు జారీ చేయవలసి ఉంటుంది‘ అని బెంచ్ స్పష్టం చేసింది. 2016లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (వాణిజ్య బ్యాంకులు, నిర్ధిష్ట ఆర్థిక సంస్థలు మోసాల వర్గీకరణ రిపోర్టింగ్) ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన అభ్యర్ధనలపై సుప్రీం తాజా తీర్పు వెలువరించింది. (జాక్ మా రిటర్న్స్: చిగురిస్తున్న కొత్త ఆశలు, షేర్లు జూమ్ )
Comments
Please login to add a commentAdd a comment