టాటా గూటికి మహారాజా!! | Tata Sons top bidder for Air India | Sakshi
Sakshi News home page

టాటా గూటికి మహారాజా!!

Published Sat, Oct 2 2021 3:01 AM | Last Updated on Sat, Oct 2 2021 3:01 AM

Tata Sons top bidder for Air India - Sakshi

న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్‌.. దశాబ్దాల క్రితం తాను నెలకొల్పిన విమానయాన సంస్థను తిరిగి దక్కించుకోవడానికి చేరువలో ఉంది. రుణభారంలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ ఎయిరిండియాను కొనుగోలు చేసే క్రమంలో అత్యధికంగా కోట్‌ చేసిన బిడ్డర్‌గా టాటా గ్రూప్‌ నిలి్చనట్లు సమాచారం.  కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సారథ్యంలో ఎయిరిండియా విక్రయంపై ఏర్పాటైన మంత్రుల కమిటీ (ఏఐఎస్‌ఏఎం) ఈ బిడ్‌పై ఆమోదముద్ర వేయాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఎయిరిండియా కొనుగోలుకు సంబంధించి ప్రైవేట్‌ రంగ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ ప్రమోటర్‌ అజయ్‌ సింగ్, టాటా గ్రూప్‌ దాఖలు చేసిన ఆర్థిక బిడ్‌లను డిజిన్వెస్ట్‌మెంట్‌పై ఏర్పాటైన కార్యదర్శుల కీలక బృందం బుధవారం పరిశీలించిందని వారు వివరించారు. నిర్దేశించిన రిజర్వ్‌ ధరతో పోల్చి చూసినప్పుడు టాటా గ్రూప్‌ అత్యధికంగా కోట్‌ చేసిన సంస్థగా నిలి్చందని పేర్కొన్నారు.

ఇక ఈ ప్రతిపాదనను ఎయిరిండియా ప్రైవేటీకరణపై ఏర్పాటైన మంత్రుల కమిటీ ముందు ఉంచనున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. అయితే, ఇటు ఆర్థిక శాఖ అటు టాటా సన్స్‌ దీనిపై స్పందించేందుకు నిరాకరించాయి. ఏఐఎస్‌ఏఎంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు.  

మరోవైపు, ఎయిరిండియా ఆర్థిక బిడ్లను ప్రభుత్వం ఆమోదించేసిందంటూ వచి్చన వార్తలను పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే తోసిపుచ్చారు. ‘ఎయిరిండియా డిజిన్వెస్ట్‌మెంట్‌ అంశంలో ఆర్థిక బిడ్‌లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందంటూ మీడియాలో వస్తున్న వార్తలు సరి కావు. ఈ విషయంలో ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడు మీడియాకు తెలియజేస్తాం’ అని ట్వీట్‌ చేశారు. టాటా గ్రూప్‌నకు ఇప్పటికే ఎయిర్‌ఏíÙయా ఇండియాలో మెజారిటీ వాటాలు ఉన్నాయి. ఇక, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో కలిసి విస్తారా అనే జాయింట్‌ వెంచర్‌ నిర్వహిస్తోంది.  

2017 నుంచి అమ్మకానికి ప్రయత్నాలు..
ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ను విలీనం చేసుకున్నాక 2007 నుంచి ఎయిరిండియా నష్టాల్లోనే కొనసాగుతోంది. భారీ రుణభారంలో కూరుకుపోయిన ఎయిరిండియాను ప్రైవేటీకరించేందుకు 2017 నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పట్లో కంపెనీని కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో.. కేంద్రం గతేడాది అక్టోబర్‌లో ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ) నిబంధనలను సడలించింది. 2020 జనవరిలో దీపం జారీ చేసిన ఈవోఐ ప్రకారం 2019 మార్చి 31 నాటికి ఎయిరిండియా రుణం రూ. 60,074 కోట్లుగా ఉంది.

ఇందులో దాదాపు రూ. 23,286.5 కోట్ల భారాన్ని కొత్త ఇన్వెస్టరు తీసుకోవాల్సి ఉంటుంది. మిగతాది ఎయిరిండియా అసెట్స్‌ హోల్డింగ్‌ (ఏఐఏహెచ్‌ఎల్‌) పేరిట ఏర్పాటు చేసే స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌కి బదలాయిస్తారు. బిడ్డింగ్‌లో గెలుపొందిన సంస్థకు దేశీ ఎయిర్‌పోర్టుల్లో 4,400 దేశీ, 1,800 అంతర్జాతీయ సర్వీసుల విమానాల ల్యాండింగ్, పార్కింగ్‌ స్లాట్లు లభిస్తాయి. అలాగే విదేశీ ఎయిర్‌పోర్టుల్లో 900 పైచిలుకు స్లాట్లు దక్కుతాయి. అలాగే చౌక విమాన సేవల సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100 శాతం, దేశీయంగా ప్రధాన విమానాశ్రయాల్లో కార్గో, గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ సేవలు అందించే ఏఐఎస్‌ఏటీఎస్‌లో 50 శాతం వాటాలు లభిస్తాయి.  

1932లో మహారాజా ప్రస్థానం ప్రారంభం...  
మహారాజా మస్కట్‌తో ఎంతో ప్రాచుర్యం పొందిన ఎయిరిండియా ప్రస్థానం .. 1932లో టాటా ఎయిర్‌లైన్స్‌ గా ప్రారంభమైంది.  జహంగీర్‌ రతన్‌జీ దాదాభాయ్‌ (జేఆర్‌డీ) దీన్ని నెలకొల్పారు. తొలినాళ్లలో దీన్ని బాంబే, కరాచీ మధ్య పోస్టల్‌ సర్వీసులకు ఉపయోగించారు. ఆ తర్వాత ప్రయాణికులకు విమాన సరీ్వసులను ప్రారంభించాక కంపెనీ చాలా వేగంగా ప్రాచుర్యంలోకి వచి్చంది. సం స్థ ప్రకటనల్లో అప్పటి ప్రముఖ బాలీవుడ్‌ నటీమణులు దర్శనమిచ్చేవారు. విమానంలో ప్రయాణించే వారికి ఖరీ దైన షాంపేన్, ప్రసిద్ధ చిత్రకారుడు శాల్వడోర్‌ డాలీ గీసిన చిత్రాలతో రూపొందించిన పోర్సెలీన్‌ యాష్‌ట్రేలు వంటి విలాసాలు అందుబాటులో ఉండేవి.

1946లో టాటా సన్స్‌ ఏవియేషన్‌ విభాగం ఎయిరిండియాగా లిస్టయ్యింది. 1948లో యూరప్‌కు విమాన సేవలతో ఎయిరిండియా ఇంటర్నేషనల్‌ ఏర్పాటైంది. దేశీయంగా ప్రభుత్వ–ప్రైవేట్‌ భాగస్వామ్యానికి ఈ ఇంటర్నేషనల్‌ సరీ్వసే నాం ది. అప్పట్లో ఈ సంస్థలో ప్రభుత్వానికి 49 శాతం, టాటాలకు 25 శాతం, మిగతా వాటా పబ్లిక్‌ దగ్గర ఉండేది. 1953లో ఎయిరిండియాను కేంద్రం జాతీయం చేసింది. 1990లు, 2000ల దాకా ఎయిరిండియా ఆధిపత్యం కొ నసాగినా ఆ తర్వాత ప్రైవేట్‌ సంస్థలు కూడా రంగంలోకి దిగడం మొదలయ్యాక క్రమంగా ప్రాభవం తగ్గడం మొదలైంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement