
వాషింగ్టన్: టెస్లా అధినేత ఎలన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలకు వాడే టెస్లా సూపర్‌చార్జర్ల నెట్‌వర్క్‌ను ఇతర కంపెనీల ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఉపయోగించుకోవచ్చునని ఎలన్ మస్క్ తెలిపారు. సూపర్ ఛార్జర్ల నెట్‌వర్క్‌ను ఇతర ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఈ ఏడాది చివర్లో తెరవాలని యోచిస్తున్నారు. అంతేకాకుండా అన్ని దేశాల్లో ఉన్న టెస్లా సూపర్ ఛార్జర్ నెట్‌వర్క్‌లను ఇతర ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని టెస్లాకు ఆదేశించారు.
ప్రపంచవ్యాప్తంగా టెస్లాకు సుమారు 25 వేల సూపర్ ఛార్జింగ్ స్టేషన్లను కల్గి ఉంది. గత నెలలో జర్మనీ రవాణా మంత్రి టెస్లాకు చెందిన సూపర్ ఛార్జర్ల నెట్‌వర్క్‌ను ఇతర ఎలక్ట్రిక్ వాహనాలు వాడుకునే విషయంపై టెస్లాతో మట్లాడారు.. మరో వైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సుమారు 7.5 బిలియన్ డాలర్లతో ఎలక్ట్రిక్ వాహనాల మౌలిక సదుపాయాలను, ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే పలు ఛార్జింగ్ కంపెనీలు బ్లింక్ ఛార్జింగ్, ఈవీగో, ఛార్జ్‌పాయింట్ హోల్డింగ్స్, వోక్స్‌వాగన్ కు చెందిన ఎలక్ట్రిఫై అమెరికా కూడా యునైటెడ్ స్టేట్స్ అంతటా ఛార్జింగ్ నెట్‌వర్క్‌లను నిర్మిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment