
గత వారం రోజుల నుంచి ఎలాంటి పెరుగుదల లేకుండా తగ్గుతూనే ఉన్న బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయి. చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 5770.. కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 6295గా ఉంది. ఈ లెక్కన తులం బంగారం రేటు వరుసగా రూ. 57700, రూ. 62950గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు రూ. 100 తగ్గినట్లు స్పష్టమవుతోంది.
చెన్నైలో ఈ రోజు బంగారం ధరలు రూ.100, రూ.110 తగ్గి తులం రేటు రూ.58200 (22 క్యారెట్స్ గోల్డ్), రూ.63490 (24 క్యారెట్స్ గోల్డ్)కు చేరింది. ఢిల్లీలో నేడు బంగారం ధరలు గరిష్టంగా రూ. 100 తగ్గింది. దీంతో 22 క్యారెట్ల తులం బంగారం ధరలు రూ. 57850 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధరలు రూ. 63100గా ఉంది.
ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం కోసం 30 సార్లు అప్లై.. ఎట్టకేలకు జాబ్ కొట్టేసింది, కానీ..
వెండి ధరలు
బంగారం ధరలు మాత్రం రోజు రోజుకి తగ్గుతుంటే.. వెండి ధరలు ఈ రోజు మళ్ళీ పెరుగుదల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న రూ. 200 తగ్గినా వెండి ఈ రోజు మళ్ళీ రూ.200 పెరిగింది.