కొన్ని రోజులు క్రితం వరుసగా తగ్గిన బంగారం ధరలు.. ఇప్పుడు క్రమంగా పెరుగుతున్నాయి. ఏడు రోజులుగా అస్సలు తగ్గని పసిడి ధరలు ఎనిమిదో రోజు స్వల్పంగా పెరిగాయి. ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఎలా ఉన్నాయనే విషయాలు ఇక్కడ చూసేద్దాం..
హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు 10 గ్రాముల బంగారం ధరలు రూ. 68300 (22 క్యారెట్స్), రూ.63600 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 150, రూ. 160 ఎక్కువ అని తెలుస్తోంది.
చెన్నైలో నిన్న రూ.300 నుంచి రూ.330 పెరిగిన బంగారం ధరలు ఈ రోజు కేవలం రూ.100 మాత్రమే పెరిగింది. దీంతో చెన్నైలో నేడు బంగారం ధరలు వరుసగా రూ. 58900 (22 క్యారెట్స్), రూ. 64250 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి.
ఢిల్లీలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ. 150 పెరిగి 58450 రూపాయలకు.. 24 క్యారెట్ల ధర రూ. 160 పెరిగి 63750 రూపాయలకు చేరింది.
వెండి ధరలు
బంగారం ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.. వెండి మాత్రమే పడి, లేస్తూ ఉంది. దీంతో నిన్న రూ. 200 తగ్గిన వెండి, ఈ రోజు రూ. 200 పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment