నిన్న లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు, ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 218.05 పాయింట్లు లేదా 0.20 శాతం నష్టంతో 70861.88 వద్ద, నిఫ్టీ 49.10 పాయింట్లు లేదా 0.11 శాతం నష్టంతో.. 21404.85 కొనసాగుతున్నాయి. నిన్న లాభాలతో ముగిసిన నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఈ రోజు నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్, కెనరా బ్యాంక్, పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, హిందాల్కో, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వంటి కంపెనీలు చేరాయి.
టెక్ మహీంద్రా, టీవీఎస్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, HCL టెక్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, లారస్ ల్యాబ్స్ లిమిటెడ్, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మొదలైన కంపీనీలు నష్టాల బాట పట్టాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment