మరి కొన్ని గంటల్లో కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. అయితే ఈ మధ్యంతర బడ్జెట్ ప్రభావం స్టాక్ మార్కెట్ల మీద పెద్దగా ఉండకపోవచ్చని పలువురు భావిస్తున్నారు.
నిన్న లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు, ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 48.63 పాయింట్ల లాభంతో 71797.71 వద్ద, నిఫ్టీ 9.65 పాయింట్ల లాభంతో 21736.10 వద్ద ముందుకు సాగుతున్నాయి. నేడు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండూ కూడా స్వల్ప లాభాలతో సాగుతున్నట్లు తెలుస్తోంది
ఈ రోజు (బుధవారం) మార్కెట్లు మునుపటి కంటే కూడా కొంత ఆశాజనకంగా ఉన్నాయి. విదేశీ, దేశీయ పెట్టుబడిదారులు ఈక్విటీలలో కొనుగోలు చేయడానికి సుముఖత చూపిస్తున్నారు. జనవరి జీఎస్‌టీ కలెక్షన్లు రూ. 1.72 లక్షల కోట్ల వద్ద పటిష్టంగా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ బడ్జెట్‌కు ముందు మ్యూట్‌గా ప్రారంభమవుతోంది.
ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో US స్టాక్స్ పతనమయ్యాయి. డౌ ట్యాంక్స్ 0.8 శాతం, ఎస్ అండ్ పీ 1.6 శాతం క్షీణించాయి. నాస్‌డాక్ 2 శాతం కంటే ఎక్కువ పడిపోయింది. అయితే ట్రెజరీలు స్థిరంగా ఉన్నాయి. అమెరికా మార్కెట్లతో పోలిస్తే ఆసియా మార్కెట్లు పతనమయ్యాయి.
నేడు టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా.. ఐషర్ మోటార్స్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, గోద్రెజ్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్, శ్రీ సిమెంట్స్ లిమిటెడ్, డిక్సన్ టెక్నాలజీస్ లిమిటెడ్, డాబర్ ఇండియా మొదలైన కంపెనీలు ఉన్నాయి.
విప్రో, లార్సెన్ & టుబ్రో, బ్రిటానియా, వోల్టాస్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, శ్రీరామ్ ఫైనాన్స్, పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment