అంతర్జాతీయ మార్కెట్‌ల ప్రభావం దేశీయ మార్కెట్లపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. దీంతో మంగళవారం ఉదయం స్టాక్ మార్కెట్‌లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.
మంగళవారం ఉదయం 9.30గంటలకు సెన్సెక్స్ 702 పాయింట్లు లాభాంతో 57282.11 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ సైతం 213పాయింట్ల లాభంతో 17167 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. బజాజ్ ఆటో,ఇండస్ ఇండ్ బ్యాంక్,ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్,సన్ ఫార్మా,బజాజ్ ఫైనాన్స్, హీరో మోటో కార్ప్,సన్ ఫార్మా, టాటా కాన్స్, ఐటీసీ,రిలయన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎషియన్ పెయింట్స్ నష్టాల్లో కొనసాగుతుంది
నో ఎఫెక్ట్
అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపించలేదు. వెరసి దేశీయ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతుండగా..చెనా రాజధాని బీజింగ్‌లోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో వైరస్ కట్టడికి పలు ప్రాంతాల్లో ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్ విధించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం రెండునెలలైనా ఆగలేదు. యూరోజోన్‌లో ద్రవ్యోల్బణం పెరగడంతో కఠినతర ద్రవ్య విధానాలను అవలంబించాలని ఈసీబీ నిర్ణయించుకుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట‍్లలో తీవ్ర ఒడిదుడుకులు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment