ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో గ్రాసరీ సేవలను అందించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా బ్లింకిట్(గ్రోఫర్స్)ను పూర్తిగా హస్తగతం చేసుకునేందుకు జొమాటో సిద్దమైంది. ఆల్‌స్టాక్ డీల్‌లోభాగంగా ఇప్పటికే ఇరు కంపెనీల వీలిన ఒప్పందంపై చర్చలు పూర్తిగా సఫలం అయ్యాయి. ఈ డీల్ విలువ సుమారు 700 నుంచి 800 మిలియన్ డాలర్లు ఉండనుంది. అయితే జొమాటో, బ్లింకిట్ కంపెనీల వీలిన ఒప్పందంపై నెటిజన్లు ట్విటర్‌లో జోకులు వేసుకుంటున్నారు.
కొత్త పేరు..!
కొంత మంది నెటిజన్లు.. ఇరు కంపెనీల వీలినంపై సరదాగా ‘జోమాటో+బ్లింకిట్= జాంబి’ అంటూ కొత్త పేరును సూచిస్తున్నారు. మరొక నెటిజన్ తన ట్విట్‌లో.. ఇకపై జొమాటో 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ చేస్తోందంటూ చెప్పుకొచ్చాడు. ఈవిధంగా నెటిజన్లు రకరకాలుగా ఇరు కంపెనీల వీలినంపై ట్విటర్‌లో నెటిజన్లు నవ్వులు పూయిస్తున్నారు.
Zomato and Blinkit to merge
— MachaZ (@Maaachaaa69) March 15, 2022
New name could be.... ZomBihttps://t.co/SUQ5XERVze
Now we can get food delivered in 10 minutes!!!🤨#ZomatoBlinkitMerger#zomato #blinkit
— Bharat (@BharatLalwani94) March 15, 2022
Meanwhile, @YatinMota sending me merger jokes on WhatsApp
— Chandra R. Srikanth (@chandrarsrikant) March 15, 2022
Zomato and Blinkit to merge
Hope, they call themselves ZomBi🙈
ఇన్వెస్టర్లకు వాటాలు..!
ఆల్ స్టాక్ డీల్ భాగంగా బ్లింకిట్‌లోని ఇన్వెస్టర్లు జొమాటోలో వాటాలను పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ 60 రోజుల వ్యవధిలో పూర్తయ్యే అవకాశం ఉంది.గత ఏడాది జొమాటో నుంచి బ్లింకిట్ భారీ పెట్టుబడులను సేకరించింది. దీంతో బ్లింకిట్ యూనికార్న్ స్టార్టప్‌గా అవతరించింది. 2021 ఆగస్టులో బ్లింకిట్‌లో సుమారు 9.3 శాతం వాటాలను 100 మిలియన్ డాలర్లతో సొంతం చేసుకుంది.
చదవండి: జొమాటో సంచలన నిర్ణయం..! ఇక పూర్తిగా
Comments
Please login to add a commentAdd a comment