అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన చిన్న సంతకం సుమారు మూడు లక్షల కోట్ల నష్టాన్ని తెచ్చి పెట్టింది. 2019లో ట్రంప్ చైనా ఎగుమతులను బ్లాక్‌లిస్ట్‌లో పెడుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే చైనీస్ దిగ్గజ కంపెనీ హువావే కొంపముంచింది.
హువావేకు భారీ దెబ్బ..!
2019లో అమెరికాలో చైనీస్ కంపెనీలపై ఆంక్షలతో విరుచుకుపడ్డాడు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దీంతో ప్రముఖ చైనీస్ దిగ్గజం హువావే టెక్నాలజీస్‌కు భారీ దెబ్బ తగిలింది. 2021 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం సుమారు 30 శాతం క్షీణించవచ్చని హువావే ఒక ప్రకటనలో పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ సవాళ్లు కొనసాగే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.
సుమారు 3 లక్షల కోట్లు గండి..!
2021 ఆర్థిక సంవత్సరానికిగాను కంపెనీ ఆదాయం సుమారు 634 బిలియన్ యువాన్లు (దాదాపు రూ. 739479.606 కోట్లు)గా ఉండొచ్చునని కంపెనీ రొటేటింగ్ చైర్మన్ గువో పింగ్ శుక్రవారం ఉద్యోగులకు రాసిన నూతన సంవత్సర లేఖలో తెలిపారు. 2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే సుమారు 30 శాతం నష్టాలను మూటకట్టుకోనుంది. 2020లో కంపెనీ ఆదాయం 891.4 బిలియన్ల యువాన్ల (దాదాపు రూ. 1039453.517 కోట్లు)గా నమోదైంది.
చదవండి: చైనా చిల్లర బుద్ధి, అప్పుడు బయోవార్‌తో కరోనా..ఇప్పుడు బయోటెక్నాలజీతో..
Comments
Please login to add a commentAdd a comment