ఇప్పటి వరకు భూమి మీద రోబోలు గోడలు కట్టడం చూసి ఉంటారు. ఇప్పుడు అభివృద్ధి చెందిన టెక్నాలజీ సాయంతో ఏకంగా చంద్రుని మీద గోడ కట్టడానికి కావాల్సిన ఓ రోబోట్ తయారీకి సర్వత్రా సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.
చంద్రుని ఉపరితలం మీదకు ఇప్పుడు రాకపోకలు ఎక్కువయ్యాయి. నాసాకు సంబంధించిన ఆర్టెమిస్ మిషన్ చంద్రునిపై కాలనీని స్థాపించడానికి సిద్ధంగా ఉందని సమాచారం. కక్ష్యలో ఉన్న గేట్‌వే & చంద్ర ఉపరితలం మధ్య వలసవాదులను రవాణా చేయడానికి స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్ (HLS) ఉపయోగిస్తుంది. దీని వల్ల రాబోయే రోజుల్లో ఇక్కడ ధూళి ఏర్పడుతుంది.
చంద్రుని మీద ధూళి ఏర్పడితే కొన్ని పరిశోధనలకు పంపించే సున్నితమైన పరికరాలలో ఏదైనా సమస్య ఏర్పడవచ్చు. కాబట్టి చంద్రుని మీద లాంచ్, ల్యాండింగ్ సైట్‌ల చుట్టూ గోడలను నిర్మించాలనే ఆలోచనతో 3D ప్రింటింగ్‌ను ఉపయోగించడం వంటి సాధ్యమైన పరిష్కారాలతో ముందే అన్వేషిస్తున్నారు.
చంద్రుని మీద గోడలను నిర్మించడానికి.. జోనాస్ వాల్తేర్ ఓ మెరుగైన మార్గం అన్వేషిస్తున్నారు. దీనికోసం హెచ్ఈఏపీ ఎక్స్‌కవేటర్‌ల వంటి ఆటోమాటిక్ రోవర్‌లను రూపొందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ రోవర్‌లు చంద్రునిమీద గోడ నిర్మించడానికి అనుకూలంగా ఉంటాయని వారు అభిప్రాయపడుతున్నారు.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రోబోటిక్స్ అండ్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అండ్ బెర్న్‌లోని సెంటర్ ఫర్ స్పేస్ అండ్ హాబిటబిలిటీలో పనిచేసిన జోనాస్ వాల్తేర్ ఆటోమాటిక్ రోబోట్స్ చంద్రునిమీద గోడలు నిర్మించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయని వెల్లడించారు. కాగా ఇప్పటికే కొంతమంది పరిశోధకులు బౌల్డర్ బ్లాస్ట్ షీల్డ్‌లను చంద్రునిపై అరిస్టార్కస్ పీఠభూమి & షాకెల్టన్ హెన్సన్ కనెక్టింగ్ రిడ్జ్ వంటి రెండు ప్రాంతాలలో గోడలు నిర్మించడానికి అనుకూలంగా ఉందా అని పరిశీలించారు.
ఇదీ చదవండి: 50వేల ఉద్యోగులకు 10 రోజుల సెలవు: ప్రముఖ కంపెనీ కీలక నిర్ణయం
పరిశోధకుల లెక్కల ప్రకారం.. 164 అడుగులు, 1030 అడుగులు చుట్టుకొలత & 10.8 అడుగుల వ్యాసార్థం కలిగిన షీల్డ్ రింగ్‌లను నిర్మించడంపై దృష్టి సారించాయి. అయితే బండరాళ్ల కోసం రోవర్లు 1000 కి.మీ ప్రయాణించాల్సి ఉంటుంది. చంద్రునిపై రోవర్‌లు ఛార్జ్ చేసుకోవడానికి.. నిద్రాణస్థితిలో ఉండటానికి సమయాన్ని లెక్కించి గోడను కనీసం 126 రోజులలో నిర్మించవచ్చని బృందం అంచనా వేసింది. అయితే చంద్రుని మీద ఇవన్నీ సాధ్యమవుతాయా? లేదా? అనేది ప్రస్తుతం సమాధానం లభించాల్సిన ప్రశ్నగానే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment