
చాలా మంది కాఫీ ప్రియులు కప్పు కాఫీతో రోజును ప్రారంభిస్తారు. పైగా చాలామంది ఆ రోజు కాఫీ తీసుకోనట్లయితే ఆ రోజంతా వారు ఏదో కోల్పోయినట్లుగా కూడా భావిస్తారు. అంతేకాదు దీనికోసం ప్రత్యేక రోజును ఏర్పాటు చేసి మరీ కాఫీ డే సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో అందరూ ప్రతి ఏటా అక్టోబర్ 1న అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అయితే కాఫీ డేని పురస్కరించుకుని జోమాటో, ఫెవికాల్ తమదైన శైలిలో వినియోదారులను ఆకర్షించేలా మార్కెటింగ్ వ్యూహాలతో ఈ వేడుకలను నిర్వహిస్తోంది.
(చదవండి: స్పైసీ మ్యాగీ మిర్చి గురూ)
ఈ రెండు కంపెనీలు కాఫీ గురించి మాట్లాడే సినిమా సన్నివేశాల చిత్రాలతో పాటు 'కాఫీ ఇద్దరి వ్యక్తుల మధ్య బంధాన్ని ఎలా పెనవేస్తుందో' వంటి మనస్సుకు హత్తుకునే సందేశాలతో ట్విట్ చేస్తూ అలరిస్తున్నాయి. జోమాటో గుడ్డు భయ్యా నుంచి కలీన్ భయ్యా వరకు....ఫ్యామిలీ మ్యాన్ శ్రీకాంత్ తివారీ నుంచి కామెడీ హీరో ఉదయ్ శెట్టి వరకు ప్రతి ఒక్కరు కాఫీని ఆస్వాదిస్తున్న ఫోటోలను పోస్ట్ చేసింది.
అంతేకాదు ప్రముఖ చిత్రమైన కభీ ఖుషీ కభీ గమ్ సినిమాలో షారుక్(రాహుల్ రాయ్‌చంద్), కాజల్(అంజలి) ఫోటోలుతో పాటు కాఫీ డే, స్మైల్ డే శుభాకాంక్షలంటూ సందేశాన్ని కూడా జోమాటో ట్విట్ చేసింది. సృజనాత్మక అడ్వర్టైస్‌మెంట్‌లతో అలరించే ఫెవికాల్ కంపెనీ తన బ్రాండ్ లోగోని రెండు కాఫీ కప్పులోని కాఫీ పై చిత్రించిన ఫోటోతోపాటు 'కాఫీ బలమైన బంధాల కోసం' అనే ట్యాగ్‌లైన్‌తో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్ ఫిదా అవుతూ రకరకాలు ట్విట్ చేస్తున్నారు. ఏదిఏమైన మంచి వ్యాపార దృక్పథం ఉంటే ఇలాంటి ప్రత్యేక రోజుని వినియోగించుకుని తమదైన తీరులో వినియోగదారులను ఆకర్షించవచ్చు అనేలా మార్కెటింగ్ వ్యూహాలతో దూసుకుపోవచ్చు అన్నట్లుగా ఉంది కదూ.
(చదవండి: ఆధార్ తప్పనిసరి కాదు)
Comments
Please login to add a commentAdd a comment