fevicol
-
‘ఫెవికాల్’ పుట్టిందిలా..
పుస్తకాలు అతికించడం నుంచి గృహోపకరణాల తయారీ వరకూ అనేక చోట్ల ఉపయోగించే ‘ఫెవికోల్’ (Fevicol) దశాబ్దాలుగా భారతీయ ఇళ్లలో భాగంగా మారిపోయింది. ఫోటోకాపీయింగ్కు జిరాక్స్ ఎలాగైతే పర్యాయ పదంగా మారిందో అలాగే బ్రాండ్‌తో సంబంధం లేకుండా జిగురు (గమ్) పదార్థాలకు ఫెవికోల్ పర్యాయపదంగా మారింది. అయితే ఈ ఐకానిక్ బ్రాండ్ వెనుక చిన్న వ్యాపారాన్ని బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యంగా మార్చిన మొదటి తరం వ్యవస్థాపకుడు బల్వంత్ పరేఖ్ అద్భుతమైన కృషి ఉంది. స్వాతంత్ర్య సమరయోధుడైన ఆయన ప్యూన్‌గా ప్రారంభమై పారిశ్రామికవేత్తగా ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయం. "ఫెవికోల్ మ్యాన్" స్ఫూర్తిదాయకమైన ప్రస్థానాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.ప్రారంభ జీవితం పోరాటాలే..గుజరాత్ లోని మహువాలో జైన కుటుంబంలో జన్మించిన బల్వంత్ పరేఖ్ తొలి జీవితం అనేక పోరాటాలతో కూడుకున్నది. ముంబైలోని గవర్నమెంట్ లా కాలేజీ నుంచి లా డిగ్రీ పొందినప్పటికీ ఆయన వేరే మార్గాన్ని ఎంచుకున్నారు. బల్వంత్ పరేఖ్ ప్రారంభ జీవితం చాలా కఠినంగా గడిచింది. ఆయన డైయింగ్, ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేశారు. తరువాత ప్యూన్ గా పనిచేశారు. ఆ సమయంలో భారతదేశం స్వాతంత్ర్య పోరాటంలో ఉంది. పరేఖ్ కూడా క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అయితే కుటుంబ ఒత్తిడితో చదువును పునఃప్రారంభించి లా డిగ్రీ పూర్తి చేశారు.వ్యాపార సామ్రాజ్యానికి పునాదిమోహన్ అనే ఇన్వెస్టర్ సహకారంతో సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న పరేఖ్.. పాశ్చాత్య దేశాల నుంచి సైకిల్, అరెకా, కాగితపు రంగులను దిగుమతి చేసుకోవడం ప్రారంభించారు. ఇందులో విజయాన్ని సాధించిన తరువాత, పరేఖ్ కుటుంబం ముంబైకి మకాం మార్చారు. ఇది ఆయన జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. తరువాత బల్వంత్ తమ ఉత్పత్తులను భారతదేశంలో మార్కెటింగ్ చేయడానికి జర్మన్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. 1954 లో ఆ కంపెనీ ఆహ్వానం మేరకు ఆయన జర్మనీ వెళ్లారు. కానీ వారి మేనేజింగ్ డైరెక్టర్ మరణించిన తరువాత ఆ సంస్థ భాగస్వామ్యం నుంచి వైదొలిగింది. ఈ ఎదురుదెబ్బ పరేఖ్‌ను అడ్డుకోలేదు. తాను కూడా సొంత వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పానికి అది ఆజ్యం పోసింది.ఫెవికోల్ ప్రారంభమైందిలా.. 1954లో బల్వంత్, ఆయన సోదరుడు సుశీల్ ముంబైలోని జాకబ్ సర్కిల్లో పరేఖ్ డైచెమ్ ఇండస్ట్రీస్‌ను స్థాపించారు. పారిశ్రామిక రసాయనాలు, వర్ణద్రవ్య ఎమల్షన్లు, రంగులను తయారు చేసి విక్రయించడం మొదలుపెట్టారు. భారతీయ జిగురు మార్కెట్లో జంతువుల కొవ్వుతో తయారైన జిగురులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయని, అవి వికృతమైనవి, సంక్లిష్టమైనవని గమనించిన పరేఖ్ ఒక అవకాశాన్ని చూశారు. ఫెవికాల్ బ్రాండ్ పేరుతో తెల్ల జిగురు తయారీని ప్రారంభించారు. ఫెవికాల్ అనే పేరు మోవికాల్ అని పిలువబడే ఇలాంటి ఉత్పత్తిని తయారు చేసే ఒక జర్మన్ కంపెనీ ప్రేరణతో వచ్చింది. జర్మన్ భాషలో "కోల్" అంటే రెండు వస్తువలను అతికించేదని అర్థం.పిడిలైట్ ఇండస్ట్రీస్ నిర్మాణంఫెవికాల్ విజయం 1959 లో పిడిలైట్ ఇండస్ట్రీస్ స్థాపనకు దారితీసింది. ఫెవికాల్ దాని నాణ్యత, విశ్వసనీయతకు గుర్తింపు పొందడంతో కంపెనీ త్వరగా ఇంటి పేరుగా మారింది. విరిగిన పాత్రలను అతికించడం దగ్గర నుంచి ఇళ్ల నిర్మాణం వరకు ఫెవికాల్ భారతీయ గృహాలలో అంతర్భాగమైంది. "ఫెవికోల్ కా జోడ్ హై, తూటేగా నహీ" అనే ట్యాగ్ లైన్ తో చేసిన అడ్వర్టైజింగ్ ప్రచారాలు వినియోగదారుల హృదయాలలో ఈ ఐకానిక్ బ్రాండ్ స్థానాన్ని మరింత సుస్థిరం చేశాయి. -
GHMC: యూ ట్యూబ్‌లో సెర్చ్ చేసి.. ఫెవికాల్+ఎంసీల్= ఫింగర్ ప్రింట్
-
జోమాటో, ఫెవీకిక్ల కాఫీ డే సంబరాలు
చాలా మంది కాఫీ ప్రియులు కప్పు కాఫీతో రోజును ప్రారంభిస్తారు. పైగా చాలామంది ఆ రోజు కాఫీ తీసుకోనట్లయితే ఆ రోజంతా వారు ఏదో కోల్పోయినట్లుగా కూడా భావిస్తారు. అంతేకాదు దీనికోసం ప్రత్యేక రోజును ఏర్పాటు చేసి మరీ కాఫీ డే సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో అందరూ ప్రతి ఏటా అక్టోబర్ 1న అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అయితే కాఫీ డేని పురస్కరించుకుని జోమాటో, ఫెవికాల్ తమదైన శైలిలో వినియోదారులను ఆకర్షించేలా మార్కెటింగ్ వ్యూహాలతో ఈ వేడుకలను నిర్వహిస్తోంది. (చదవండి: స్పైసీ మ్యాగీ మిర్చి గురూ) ఈ రెండు కంపెనీలు కాఫీ గురించి మాట్లాడే సినిమా సన్నివేశాల చిత్రాలతో పాటు 'కాఫీ ఇద్దరి వ్యక్తుల మధ్య బంధాన్ని ఎలా పెనవేస్తుందో' వంటి మనస్సుకు హత్తుకునే సందేశాలతో ట్విట్ చేస్తూ అలరిస్తున్నాయి. జోమాటో గుడ్డు భయ్యా నుంచి కలీన్ భయ్యా వరకు....ఫ్యామిలీ మ్యాన్ శ్రీకాంత్ తివారీ నుంచి కామెడీ హీరో ఉదయ్ శెట్టి వరకు ప్రతి ఒక్కరు కాఫీని ఆస్వాదిస్తున్న ఫోటోలను పోస్ట్ చేసింది. అంతేకాదు ప్రముఖ చిత్రమైన కభీ ఖుషీ కభీ గమ్ సినిమాలో షారుక్(రాహుల్ రాయ్‌చంద్), కాజల్(అంజలి) ఫోటోలుతో పాటు కాఫీ డే, స్మైల్ డే శుభాకాంక్షలంటూ సందేశాన్ని కూడా జోమాటో ట్విట్ చేసింది. సృజనాత్మక అడ్వర్టైస్మెంట్లతో అలరించే ఫెవికాల్ కంపెనీ తన బ్రాండ్ లోగోని రెండు కాఫీ కప్పులోని కాఫీ పై చిత్రించిన ఫోటోతోపాటు 'కాఫీ బలమైన బంధాల కోసం' అనే ట్యాగ్‌లైన్‌తో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్ ఫిదా అవుతూ రకరకాలు ట్విట్ చేస్తున్నారు. ఏదిఏమైన మంచి వ్యాపార దృక్పథం ఉంటే ఇలాంటి ప్రత్యేక రోజుని వినియోగించుకుని తమదైన తీరులో వినియోగదారులను ఆకర్షించవచ్చు అనేలా మార్కెటింగ్ వ్యూహాలతో దూసుకుపోవచ్చు అన్నట్లుగా ఉంది కదూ. (చదవండి: ఆధార్ తప్పనిసరి కాదు) -
కోకా కోలా వివాదం: ఫెవికాల్ అదిరిపోయే యాడ్, నెటిజన్లు ఫిదా!
యూరో ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ ప్రెస్ మీట్ సందర్భంగా పోర్చుగల్ స్టార్ ప్లేయర్ రొనాల్డో.. తనకు ఎదురుగా ఉన్న కోక్ బాటిళ్లను చిరాకుగా పక్కనపెట్టి, మంచి నీళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించిన విషయం తెలిసిందే. కొద్దిసేపటికే ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. రొనాల్డో చేసిన ఈ చర్యతో కోకా కోలా కంపెనీ షేర్లు బోరుమన్నాయి. ఒక్కసారిగా కోకా కోలా షేర్లకు సుమారు 4 మిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది. ఆసక్తికరమైన ప్రకటనల విషయానికి వస్తే తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్న ఫెవికాల్, తాజాగా ఒక పోస్ట్‌ను ట్విటర్లో షేర్ చేసింది. రోనాల్డో కోకాకోలా బాటిళ్లను తొలగించే విషయంపై ఫెవికోల్ కంపెనీ ఇన్‌డైరక్ట్‌గా కోకాకోలాకు అదిరిపోయే సూచన చేసింది. ఫెవికాల్ తన ట్విటర్ పోస్ట్‌లో.. రొనాల్డో హజరైన ప్రెస్‌మీట్‌ను పోలి ఉన్న ఫోటోలో, కోకాకోలా బాటిళ్లకు బదులు ఫెవికోల్ డబ్బాలను ఏర్పాటు చేసింది. వీటిని ఎవరూ అక్కడి నుంచి తీయలేరు. అంతేకాకుండా కంపెనీ షేర్ విలువ కూడా పడిపోయేది (నా బాటిల్ హేటేగీ, నా వాల్యుయేషన్ ఘటేగి)కాదని.. సూచిస్తూ వ్యంగ్యంగా కోకాకోలాకు సూచించింది. కోకాకోలా బాటిళ్లు అక్కడి నుంచి తీయకుండా ఉండేందుకు ఫెవికాల్ అంటించి ఉంటే కోకాకోలాకు ఈ పరిస్ధితి వచ్చేదికాదని పేర్కొంది. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్‌ను చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఫెవికాల్ మార్కెట్ స్ట్రాటజీను చూసి నెటిజన్లు ఔరా..! అంటూ రిట్వీట్ చేస్తున్నారు. కాగా అప్పుడప్పుడు కొన్ని సందర్బాల్లో ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనలపై ఫెవికోల్ వ్యంగ్యంగా జవాబిస్తూ తన మార్కెట్‌ను పెంచుకుంటుంది. Haye ni mera Coka Coka Coka Coka Coka#Euro2020 #Ronaldo #MazbootJod #FevicolKaJod pic.twitter.com/lv6YWrgfxB — Fevicol (@StuckByFevicol) June 17, 2021 Cristiano Ronaldo was angry because they put Coca Cola in front of him at the Portugal press conference, instead of water! 😂 He moved them and said "Drink water" 😆pic.twitter.com/U1aJg9PcXq — FutbolBible (@FutbolBible) June 14, 2021 చదవండి: బాటిల్సే కాదు.. ఏం ముట్టుకున్నా మోతే ఇక! -
పిడిలైట్ ఇండస్ట్రీస్- అజంతా ఫార్మా.. జోరు
పలు దేశాలలో తిరిగి కరోనా వైరస్ కేసులు తలెత్తుతుండటంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు పతన బాట పట్టాయి. దేశీయంగానూ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనూ సానుకూల వార్తల కారణంగా పిడిలైట్ ఇండస్ట్రీస్, అజంతా ఫార్మా కౌంటర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో నష్టాల మార్కెట్లోనూ ఈ షేర్లు లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. పిడిలైట్ ఇండస్ట్రీస్ హంట్స్‌మన్ గ్రూప్‌నకు చెందిన దేశీ అనుబంధ విభాగాన్ని కొనుగోలు చేయనున్నట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం పిడిలైట్ ఇండస్ట్రీస్ తాజాగా పేర్కొంది. ఇందుకు యూఎస్ఏ కంపెనీతో కుదుర్చుకున్న తప్పనిసరి ఒప్పందానికి బోర్డు ఆమోదముద్ర వేసినట్లు తెలియజేసింది. తద్వారా హంట్స్‌మన్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ సొల్యూషన్స్‌లో 100 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. ఇందుకు సుమారు రూ. 2,100 కోట్లను వెచ్చించనున్నట్లు తెలియజేసింది. హంట్స్‌మన్ అడ్వాన్స్డ్.. అరాల్డైట్, అరాసీల్ తదితర ప్రొడక్టులను కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో పిడిలైట్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 1,578 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,591 వరకూ పురోగమించింది. అజంతా ఫార్మా సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు ప్రతిపాదించినట్లు హెల్త్‌కేర్ కంపెనీ అజంతా ఫార్మా తాజాగా పేర్కొంది. వచ్చే నెల 3న కంపెనీ బోర్డు సమావేంకానున్నట్లు తెలియజేసింది. తద్వారా ఈక్విటీ షేర్ల బైబ్యాక్ అంశాన్ని పరిశీలించడంతోపాటు.. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక ఫలితాలను సైతం బోర్డు విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో అజంతా ఫార్మా షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 1,650 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1,680 వరకూ లాభపడింది. -
వినైల్ కెమికల్స్.. వండర్ ర్యాలీ
పిడిలైట్ ఇండస్ట్రీస్ ప్రమోట్ చేసిన వినైల్ కెమికల్స్ ఇటీవల ర్యాలీ బాట పట్టింది.పరేఖ్ గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీ ప్రధానంగా కెమికల్స్ ట్రేడింగ్‌ను నిర్వహిస్తుంటుంది. ప్రధానంగా విదేశీ కంపెనీల నుంచి వినైల్ ఎసిటేట్ మోనోమర్(VAM) సరఫరాకు ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా దిగుమతి చేసుకుని దేశీయంగా పంపిణీ చేస్తుంటుంది. కంపెనీలో పిడిలైట్ ఇండస్ట్రీస్‌కు 50.62 శాతం వాటా ఉంది. ఈ మార్చికల్లా వినైల్ కెమికల్స్‌లో పబ్లిక్ వాటా 40.9 శాతంగా నమోదైంది. జోరు తీరిలా వినైల్ కెమికల్స్ షేరు వరుసగా రెండో రోజు జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో అమ్మేవాళ్లు కరువై 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఎన్ఎస్ఈలో రూ. 10 ఎగసి రూ. 109 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. మంగళవారం సైతం ఈ షేరు 10 శాతం జంప్‌చేసింది. కాగా.. నేటి ట్రేడింగ్‌లో మధ్యాహ్నం 1కల్లా ఈ కౌంటర్లో 1.42 మిలియన్ షేర్లు చేతులు మారాయి. ఇది వినైల్ కెమికల్స్ ఈక్విటీలో 7.7 శాతం వాటాకు సమానంకావడం విశేషం! ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో కలిపి లక్ష షేర్లు పెండింగ్‌లో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. 50 శాతం ప్లస్ గత నెల రోజుల్లో వినైల్ కెమికల్స్ షేరు ఏకంగా 111 శాతం దూసుకెళ్లింది. రూ. 52 స్థాయి నుంచి ప్రస్తుతం రూ. 109కు ర్యాలీ చేసింది. గత వారం రోజుల్లోనే 50 శాతం పురోగమించింది. ఈ షేరు ఇంతక్రితం 2018 మే 2న రూ. 136 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. కాగా.. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ నిరుత్సాహకర పనితీరు నేపథ్యంలో షేరు నీరసించినప్పటికీ ఇటీవల జోరు చూపుతుండటం గమనార్హమని విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే షేరు ర్యాలీ వెనుక కారణాలు ఇంతవరకూ వెల్లడికాలేదని చెబుతున్నారు. -
హెరిటేజ్ పెరుగా.. ఫెవికాల్ గమ్మా?
► తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో కలకలం ► హెరిటేజ్ పాలు తాగిన బాలుడికి అస్వస్థత శంఖవరం (పత్తిపాడు): తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడిలో హెరిటేజ్ పాలు తాగిన ఏడాది బాలుడు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన వైనం కలకలం రేపింది. ఆ బాలుని తండ్రి ‘‘ఇవి పాలా, పెరుగా? హెరిటేజ్ గమ్మా?’’ అంటూ ఆ సంస్థ మార్కెటింగ్ మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి బాధితుడు షేక్ గౌస్ శనివారం విలేకర్లకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక హెరిటేజ్ ప్లాంట్‌లో శుక్రవారం రాత్రి గౌస్ రెండు పాల ప్యాకెట్లు కొనుగోలు చేశారు. వాటిలో ఒక ప్యాకెట్ పాలను ఆయన భార్య పెరుగుగా వాడుకునేందుకు తోడు పెట్టారు. మరో ప్యాకెట్ పాలను ఉదయం వారి కుమారుడు రెహెన్(1)కు ఇచ్చేందుకు ఫ్రిజ్‌లో పెట్టారు. ఉదయాన్నే పాలు కాచి పట్టించగా, రెహెన్‌కు వాంతులు, విరేచనాలు అయ్యాయి. వెంటనే అతడిని హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి పరుగులు తీశారు. ప్రస్తుతం రెహెన్ ఆస్పత్రిలో కోలుకున్నాడు. అనంతరం ఇంటికి వెళ్లి గౌస్ భోజనం చేస్తుండగా పెరుగు వేసుకుందామని గిన్నెలో గరిటె పెడితే బయటకు రాలేదు. గమ్‌లా పెరుగు గరిటెను పట్టుకుని వదల్లేదని గౌస్ వివరించారు. దీంతో అనుమానం వచ్చిన ఆయన హెరిటేజ్ ప్లాంట్‌కు వెళ్లి అమ్మకందారును నిలదీశారు. ఆయన మార్కెటింగ్ మేనేజర్ ఫోన్ నంబరు ఇవ్వడంతో ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హెరిటేజ్ అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్ ఎస్.బాబి శనివారం సాయంత్రం వచ్చి ఆ పెరుగును పరిశీలించారని గౌస్ చెప్పారు. ఆయనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. తోడు పెట్టిన పెరుగును, ప్యాకెట్లను పరిశీలనకు పంపుతానని చెప్పి వెళ్లారని వివరించారు.