రోడ్డు ప్రమాదంలో సచివాలయ ఉద్యోగి మృతి
శ్రీకాళహస్తి రూరల్: రోడ్డు ప్రమాదంలో సచివాలయ ఉద్యోగి మృతిచెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. స్థానికుల సమాచారం మేరకు.. మండలంలోని కాపుగున్నేరి సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్‌కే కే.రాజ్‌కుమార్ (29) గురువారం విధులు ముగించుకుని సాయంత్రం 6.30 సమయంలో ఇంటికి వెళ్లేందుకు కాపు గున్నేరి హైవే రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో శ్రీకాళహస్తి వైపు వేగంగా వెళుతున్న కారు ఢీకొంది. దీంతో రాజ్ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సహచర ఉద్యోగులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళుతుండగా.. మార్గమధ్యంలోనే మృతిచెందాడు. శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారణమైన కారుని పోలీస్ స్టేషన్ తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
శ్రీవారి దర్శనానికి 6 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 9 కంపార్ట్‌మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 59,231 మంది స్వామివారిని దర్శించుకోగా 22,029 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.08 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment