
కరెంటు స్తంభాన్ని ఢీకొని వాహనం బోల్తా
● ముగ్గురికి తీవ్ర, ఏడుగురికి స్వల్ప గాయాలు
గంగాధరనెల్లూరు : కరెంటు స్తంభాన్ని ఢీకొని టాటా ఏస్ బోల్తా పడిన ఘటన మండల పరిధిలోని ముక్కలతూరు వద్ద చోటు చేసుకుంది. స్థానిక పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా.. గంగాధర మండలం వేల్కూరులోని ఇందిరానగర్‌లో శనివారం ఒక వ్యక్తి మృతి చెందడంతో అదే మండలానికి చెందిన ఆత్మకూరు గ్రామానికి చెందిన వారు అంత్యక్రియలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ముక్కలత్తూరు పంచాయతీ నాసనపల్లి సమీపంలో కాసా బిల్డింగ్ వద్ద టాటా ఏస్ వాహనం అదుపు తప్పి రోడ్డు సమీపంలోని విద్యుత్ స్తంభాన్ని ఢీ కొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షత్రగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఇంద్రాణి, మేరి, దేవరాజులను మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు, స్వల్పగాయాలైన వారిని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసంతి తెలిపారు.

కరెంటు స్తంభాన్ని ఢీకొని వాహనం బోల్తా
Comments
Please login to add a commentAdd a comment