చిత్తూరు రూరల్(కాణిపాకం): చిత్తూరు నగరంలోని చవటపల్లె పీహెచ్‌సీ పరిధిలో సోమవారం ఏఎఫ్‌బీ(అక్యూట్ ఫాల్సీ పెరాలసిస్) అనుమానిత కేసును జిల్లావైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. అందిన సమాచారం మేరకు.. డీఐఓ హనుమంతరావు ఆ ప్రాంతంలో ఆకస్మికంగా ఇంటింటా పరిశీలన చేశారు. ఈ పరిశీలనలో ఓ అనుమానిత కేసు బయటపడింది. ఆ కేసు మలం శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం తమిళనాడులోని చైన్నెకి పంపారు. ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించాలని గ్రామస్తులకు సూచించారు.
భవనంపై నుంచి పడి యువకుడి మృతి
కుప్పం : పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద నిర్మిస్తున్న భవనంపై నుంచి సోమవారం ప్రమాదశాత్తు జారి పడి ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. కొత్తయిండ్లు గ్రామానికి చెందిన మురుగేష్(25) పెయింటింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మూడంతస్తుల భవనంలో పనిచేస్తుండగా కాలుజారి కిందపడ్డాడు. ఈ క్రమంలో గుడుపల్లె మండలం చీకటిపల్లెకు చెందిన బాలాజీ మురుగేష్‌ను కాపాడేందుకు యత్నించగా ఇద్దరు కింద పడ్డారు. మురుగేష్ అక్కడికక్కడే మృతి చెందగా, బాలాజీ తీవ్రంగా గాయపడి పీఈఎస్ మెడికల్ కళాశాలలో చికత్స పొందుతున్నాడు. ఈ మేరకు కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment