సీఎం చంద్రబాబుకు సాదర స్వాగతం
శ్రీకాళహస్తి రూరల్ (రేణిగుంట): అంతర్జాతీయ దేవాలయాల కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సాదర స్వాగతం లభించింది. రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఈఓ శ్యామలరావు, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు, కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్దన్ రాజు, జేసీ శుభం బన్సల్, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్‌రెడ్డి, నెలవల విజయశ్రీ, కోనేటి ఆదిమూలం, కురుగొండ్ల రామకృష్ణ, భానుప్రకాష్, మురళీమోహన్, డా.వీయం. థామస్, మాజీ ఎంఎల్‌ఏ సుగుణమ్మ, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డీఓలు భానుప్రకాష్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం ఆయన తిరుపతికి రోడ్డు మార్గాన పయనమయ్యారు.
సీఎంకు సాదర వీడ్కోలు
రేణిగుంట విమానాశ్రయంలో సీఎం చంద్రబాబునాయుడుకు సాదర వీడ్కోలు లభించింది. మంత్రితోపాటు టీటీడీ ఈఓ ఇతర అధికారులు ఆయనకు వీడ్కోలు పలికారు.
అమ్మవారి ఆలయ నిర్మాణానికి
స్థలం కేటాయిచండి
తిరుమల: ముంబైలో అమ్మవారి ఆలయం, టీటీడీ సమాచార కేంద్రాన్ని నిర్మించేందుకు స్థలం కేటాయించాలని కోరుతూ టీటీడీ చైర్మన్ బీఆర్.నాయుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ద్వారా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు వినతి పత్రం అందజేశారు. సోమవారం తిరుపతిలో ఆయనను కలసి విన్నవించారు. ఇప్పటికే నవీ ముంబైలో ఉల్వే ప్రాంతంలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం 3.61 ఎకరాల స్థలాన్ని లీజు ప్రాతిపదికన కేటాయించారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరో 1.5 ఎకరాల స్థలంలో అమ్మవారి ఆలయాన్ని కూడా నిర్మించాలని టీటీడీ నిర్ణయించిందని, ఈ మేరకు స్థలాన్ని కేటాయించాలని, బాంద్రాలో టీటీడీ సమాచార కేంద్రానికి కొంత స్థలాన్ని కేటాయించాలని టీటీడీ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment