చేయూత కోసం.. చిన్నారి ప్రాణం
వి.కోట : దాతల సాయం కోసం ఓ చిన్నారి ఎదురుచూస్తోంది. బిడ్డ ప్రాణం కాపాడాలని ఓ తండ్రి వేడుకోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. వి.కోట మండలం గాండ్లపల్లె గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన కుమార్తె రక్ష(8)కు ప్రమాదవశాత్తు నిప్పంటుకుని శరీరం చాలా వరకు కాలిపోయింది. వేలూరు సీఎంసీలో చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. వైద్యానికి దాదాపు రూ.15 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలిపారు. దీంతో దాతల సాయం కోసం బాధిత తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. మనసున్న వారు ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు దుర్గాప్రసాద్ నంబర్ 8618134582కు సాయం అందించాలని విన్నవిస్తున్నారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. టీటీడీ అధికారుల సమాచారం మేరకు స్వామి వారి సర్వదర్శనం సుమారు 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఆదివారం అర్ధరాత్రికి 79,705 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 24,836 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.67కోట్లుగా అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment