
గంజాయి తరలిస్తున్న దంపతుల అరెస్ట్
● 1,200 గ్రాముల గంజాయి స్వాధీనం
నగరి : గంజాయి తరలిస్తున్న దంపతులను శనివారం సీఐ మహేశ్వర్ అరెస్టు చేశారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. గంజాయి తరలింపుపై వచ్చిన సమాచారం మేరకు డీఎస్పీ సయ్యద్ మహ్మద్ అజీజ్ ఆదేశాల మేరకు డెప్యూటీ తహసీల్దార్ ధనుంజయలుతో పాటు ఓజీ కుప్పం గ్రామ మార్గంలో కాపుకాసి గంజాయి తరలిస్తున్న దంపతులు జీ.నరసింహులు (56), పుష్పవతి (48)ని అరెస్టు చేసినట్టు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.25 వేల విలువ చేసే 1,200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment