
అల్లం లోడ్ లారీ కాలువలో బోల్తా
తవణంపల్లె : మండలంలోని జొన్నగురకల సమీపంలోని హంద్రీనీవా కాలువలో అదుపు తప్పి బోల్తా పడింది. స్థానికులు తవణంపల్లె పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై ఎస్‌ఐ చిరంజీవి మాట్లాడుతూ.. చింతామణి నుంచి లారీలో అల్లం (సుమారు 15 టన్నులు) లోడ్‌తో ఒడిశాకు బయలుదేరిందని వివరించారు. రోడ్డు మార్గం తప్పిన వాహనం బంగారుపాళ్యం నుంచి అరగొండ మీదుగా వచ్చి జొన్నగురుకల సమీపంలో అదుపుతప్పి హంద్రీనీవా కాలువలో బోల్తా పడింది. డ్రైవర్, క్లీనర్ ఎలాంటి గాయాలు లేకుండా ప్రమాదం నుంచి బయట పడ్డారు.
జొన్నగురకల సమీపంలో బోల్తాపడిన లారీ
Comments
Please login to add a commentAdd a comment