వృద్ధుడి ఆత్మహత్య
గంగవరం : అనారోగ్య సమస్యలతో వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో ఆది వారం చోటుచేసుకుంది. మండలంలోని మర్రిమాకులపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణప్ప (61) కూలి పనులతో జీవనాధారం. ఆయన కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అప్పుడప్పుడూ తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నాడు. మనస్తాపం చెంది ఉదయం పొలం వద్దకు వెళ్లి జిల్లేడుపాలు తాగాడు. గమనించిన స్థానికులు వృద్ధుడి చికిత్స కోసం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భూ తగాదాతో దాడి
– నిల్వ కొయ్యలకు నిప్పు పెట్టిన వైనం
చౌడేపల్లె : భూ తగాదా విషయమై పాత కక్షలతో తనపై దాడి చేశారని మొరంకిందపల్లెకు చెందిన వెంకటరమణారెడ్డి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి కథనం మేరకు వివరాలు.. గ్రామానికి సమీపంలోని భూముల్లో వెంకట రమణారెడ్డి టమాటా పంట సాగు చేయడానికి ఏర్పాట్లు చేస్తుండగా అదే గ్రామానికి చెందిన మునస్వామి, సుబ్రమణ్యం, బాలకృష్ణ తనపై దౌర్జన్యం చేసి, దాడికి తెగబడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా తన పొలంలో సుమారు రూ.లక్ష విలువ చేసే టమాటా సాగు కోసం నిల్వ చేసిన కట్టెలకు నిప్పంటించినట్లు తెలిపారు. తనతో పాటు తన కుటుంబానికి వీరి వలన ప్రాణహాని ఉందని రక్షక్షణ కల్పించాలని పోలీసులకు వెంకట రమణారెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
వృద్ధుడి ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment