శివరాత్రికి ప్రత్యేక బస్సులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): మహాశివరాత్రిని పురస్కరించుకుని చిత్తూరు ఆర్టీసీ–2 డిపో నుంచి పలు ఆలయాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డీపీటీఓ జగదీష్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ అలాగే సిద్ధేశ్వరస్వామి కొండ, మరకతవళ్లి సమేత స్వయంభు శ్రీసిద్ధేశ్వరస్వామి ఆలయాలకు పెనుమూరు, పచ్చికాపల్లం నుంచి ప్రత్యేక సర్వీసులు ఉంటాయని వెల్లడించారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
స్టోర్స్ భవనానికి భూమి పూజ
చిత్తూరు కార్పొరేషన్: ట్రాన్స్‌కో ఉమ్మడి జిల్లా స్టోర్స్ భవనానికి సోమవారం భూమి పూజ చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఈ భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు. ఈ క్రమంలో తిరుపతి, చిత్తూరు జిల్లాల ఎస్‌ఈలు సురేంద్రనాయుడు, ఇస్మాయిల్ అహ్మద్ మాట్లాడుతూ రూ.45 లక్షల వ్యయంతో నూతన భవనం నిర్మించనున్నట్లు వెల్లడించారు. అలాగే చిత్తూరులో రూ.47లక్షలతో నిర్మిస్తున్న ఎస్‌ఈ కార్యాలయ భవనం పనులు శరవేగంగా సాగుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఈఈలు మునిచంద్ర, వాసవీలత, శ్రీనివాసులు, డీఈలు వసంతనాయుడు, ఆనంద్, ఏఈలు మోహన్‌రావు, జనార్ధన్‌నాయుడు పాల్గొన్నారు.
వర్మీకంపోస్ట్‌తో భూసారం
చిత్తూరు కలెక్టరేట్ : వర్మీకంపోస్ట్‌తో భూసా రం పెరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో వర్మీకంపోస్ట్ స్టాల్‌ను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ వర్మీ కంపోస్ట్‌తో మట్టికి మంచి పోషకాలు లభిస్తాయన్నారు. దీంతో పంట దిగుబడి పెరుగుతుందని వెల్లడించారు. పర్యావరణహితమైన వర్మీకంపోస్టును రైతులు విరివిరిగా వినియోగించుకోవాలని సూచించారు. సేంద్రియ విధానంపై ఆసక్తిగలవారు ప్రతి సోమవారం కలెక్టరేట్‌లోని స్టాల్‌కు వచ్చి నాణ్యమైన వర్మీకంపోస్టు పొందవచ్చని చెప్పారు. రైతులు రసాయన ఎరువులపై ఆధారపడకుండా సహజసిద్ధమైన వర్మీకంపోస్ట్ వాడుకోవాలని కోరా రు. కార్యక్రమంలో డీపీఓ సుధాకర్‌రావు, డీపీఆర్‌సీ జిల్లా కో–ఆర్డినేటర్ షణ్ముగం పాల్గొన్నారు.
1న జిల్లాకు ముఖ్యమంత్రి రాక
చిత్తూరు కలెక్టరేట్ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మార్చి 1వ తేదీన జిల్లాకు రానున్నట్లు కలెక్టరేట్ అధికారులు సోమవారం వెల్లడించారు. గంగాధరనెల్లూరులో చేపట్టే పింఛన్ల పంపిణీలో సీఎం పాల్గొనన్నుట్లు తెలిపారు. ఈ మేరకు పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
శివరాత్రికి ప్రత్యేక బస్సులు
Comments
Please login to add a commentAdd a comment