శాంతిపురం : స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విదార్థినులను అదే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి, తన స్నేహితులు టీజింగ్ చేయడం కలకలం రేపింది. సోమవారం సాయంత్రం స్కూలు ముగిశాక జాతీయ రహదారి మీదుగా ఇంటికి కాలి నడకన బాలికలు బయలుదేరారు. అదే సమయంలో మరో గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థి, తన మిత్రులతో కలిసి బైకుపై వచ్చి అమ్మాయిలపై పూలు చల్లుతూ ఆకతాయి వేషాలు వేశారు. బాలికలు ఇంటికి వెళ్లి తమ తల్లిదండ్రులకు చెప్పడంతో మంగళవారం వారు పాఠశాలకు వచ్చి హెచ్‌ఎం నటరాజరెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో 9వ తరగతి విద్యార్థి కుటుంబ సభ్యులను పిలిపించిన హెచ్‌ఎం వారిని హెచ్చరించి పంపారు. నిందితుడు, బాధిత బాలికలు అందరూ మైనర్లే కావడంతో వారికి వేర్వేరుగా కౌన్సెలింగ్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment