అశేషం..శివోహం!
శ్రీకాళహస్తి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారు శేష వాహనంపై, అమ్మవారు యాళి వాహనంపై ఆశీనులై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. మొదట స్వామి, అమ్మవార్లను ఆలయ అలంకార మండపంలో సర్వాంగసుందరంగా అలంకరించారు. మేళతాళాలు, మంగళ వవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకుని రాజగోపురం వద్దకు వేంచేశారు. అక్కడ స్వామివారిని శేష వాహనంపై, అమ్మవారిని యాళి వాహనంపై అధిష్టింపజేశారు. అనంతరం పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.
హంస, శుక వాహనాలపై ఆదిదంపతులు..
ఐదో రోజైన మంగళవారం ఉదయం శ్రీకాళహస్తీశ్వరస్వామి బంగారు హంస వాహనంపై, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు శుక వాహనంపై పురవీధుల్లో ఊరేగారు. మూషిక వాహనంపై వినాయకస్వామి, చప్పరాలపై శ్రీవళ్లీ, దేవసే సమేత కుమారస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప కొలవుదీరి స్వామి, అమ్మవార్లను అనుసరించారు. కళాకారుల కోలాటాలు, శివనామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఈఓ బాపిరెడ్డి పాల్గొన్నారు.
పట్టువస్త్రాల సమర్పణ
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేతులమీదుగా పట్టు వస్త్రాలు అందజేశారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్, ఈఓ బాపిరెడ్డి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment