క్వారీ తవ్వకాలకు అనుమతించొద్దు
శాంతిపురం : రాతి క్వారీ తవ్వకాలకు అనుమతించవద్దని సి.బండపల్లి, బేవనపల్లి గ్రామాల ప్రజలు అధికారులకు మొరపెట్టుకున్నారు. ముద్దనపల్లి రెవెన్యూ లోని సర్వే నంబర్ 54/పి లోని 4.301 హెక్టార్లలో మె స్సర్స్ బియాండ్ స్కేల్ టెక్పాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు తవ్వకాలు జరిపేందుకు గురువారం సి.బండపల్లిలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. కుప్పం ఆర్డీఓ శ్రీనివాసులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారి రాజశేఖర్ ప్రజల అభిప్రాయాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా సి.బండపల్లి, బేవనపల్లి గ్రామాల ప్రజలు క్వారీ తవ్వకాలను పూర్తిగా వ్యతిరేకించారు. ప్రతిపాదిత క్వారీ నుంచి 10 మీటర్లలోపు 500 ఏళ్ల నా టి జొన్న గంగమ్మ ఆలయం ఉందని చెప్పారు. జడ్పీ ఉన్నత పాఠశాల, గ్రామానికి 500 మీటర్ల లోపు క్వారీ కి అనుమతులు ఇవ్వరాదని స్పష్టం చేశారు. ఇంత తక్కువ దూరంలో క్వారీ పేలుళ్లు జరిపితే నివాస గృహాలు, స్కూలు భవనాలు దెబ్బతింటాయని ఆందోళ న వ్యక్తం చేశారు. పంచాయతీకి చెందిన డంపింగ్ యా ర్డు కూడా ఇదే సర్వే నంబర్‌లో ఉందన్నారు. సమీపంలోని క్వారీలో పేలుడు పదార్థాల వినియోగం కారణంగా పక్కనే ఉన్న శ్యామనకుంట, పెద్దవంక చెరువు, నా యనచెరువులలో నీరు కలుషితం అవుతోందన్నారు. కొత్తగా మరో క్వారీకి ఇక్కడ అనుమతులు ఇస్తే కాలు ష్య ముప్పు మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికుల అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా క్వారీకి అనుమతులు ఇచ్చేసి, ఇప్పుడు వచ్చి తవ్వకాల కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారని ఆగ్రహంతో వాదనకు దిగారు. దీంతో స్థానికుల అభ్యంతరాలను తాము ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతామని చెప్పి అధికారులు ప్రజాభిప్రాయ సేకరణను ముగించారు. కాగా క్వారీకి అనుమతి పొందిన సంస్థ కూటమి ప్రభుత్వంలోని ఓ మంత్రి బినామీ సంస్థగా ప్రచారం సాగుతోంది.
ప్రజాభిప్రాయ సేకరణలో వేడుకోలు
ఆందోళన వ్యక్తం చేసిన బండపల్లి, బేవనపల్లి ప్రజలు
క్వారీ తవ్వకాలకు అనుమతించొద్దు
Comments
Please login to add a commentAdd a comment