‘ఓపెన్’ బేరం
రెండు జిల్లాల సమాచారం
చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన కేంద్రాలు 15
తిరుపతి జిల్లాలో కేంద్రాలు 14
చిత్తూరు జిల్లాలో ఇంటర్ అభ్యర్థులు 3,419
తిరుపతి జిల్లాలో ఇంటర్ అభ్యర్థులు 2,838
నేటి నుంచి ఓపెన్ ఇంటర్
పరీక్షలు ప్రారంభం
చిత్తూరు కలెక్టరేట్ : ఆంధ్రప్రదేశ్ ఓపెన్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు డీఈఓ వరలక్ష్మి తెలిపారు. ఆదివారం విలేకరులతో మాట్లాడారు. పరీక్షలకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. నేటి నుంచి 15వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 15 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే పరీక్షల నిర్వహణ చీఫ్, డిపార్ట్‌మెంట్ అధికారులకు సమావేశం నిర్వహించి తగు సూచనలిచ్చామన్నారు. జిల్లాలో ఈ పరీక్షలకు 3,419 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌లను సంబంధిత ఏ1 సెంటర్ నుంచి లేకుంటే ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరుకావచ్చన్నారు.
ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్షలకు ఓపెన్‌గా బేరం కుదిరినట్లు సమాచారం. స్టడీ సెంటర్ల కోఆర్డినేటర్లు ఇంటర్ అభ్యర్థుల నుంచి కల్లు చెదిరే డీల్ కుదిరినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి వద్ద నుంచి రూ.6 కోట్లకు పైగా డబ్బులు వసూలు అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాస్ కాపీయింగ్‌కు అంతా పకడ్బందీగా సిద్ధం చేశారు. ముడుపులు ముట్టజెప్పిన అభ్యర్థులకు అనుకూలమైన కేంద్రాలు.. తెలిసిన ఇన్విజిలేటర్లు పరీక్ష కేంద్రంలో ఉండేలా ప్రణాళిక రచించినట్లు వినికిడి. ఇంత పెద్ద స్థాయిలో దోపిడీకి తెరలేపడంపై ఉన్నతాధికారులకు తెలిసే ఈ బాగోతం నడిచినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 3వ తేదీ నుంచి ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు చిత్తూరు జిల్లాలో 15, తిరుపతి జిల్లాలో 14 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు సోమవారం నుంచి 15వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. రెండు జిల్లాల్లో ఈ పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థుల నుంచి కొందరు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌కు సహకరించడానికి ఇంటర్ పరీక్షలు రాసే అభ్యర్థి నుంచి సగటున రూ.5 వేల నుంచి 10 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ తతంగం మొత్తం రెండు జిల్లాల్లోని ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ల కో ఆర్డినేటర్‌లు నిర్వహిస్తున్నారు. వసూళ్ల అనంతరం విద్యాశాఖ అధికారులకు అప్పజెప్పేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.
రెండు జిల్లాల్లో 6257 మంది అభ్యర్థులు..
చిత్తూరు జిల్లాలో 3419 మంది, తిరుపతి జిల్లాలో 2838 మొత్తం 6,257 అభ్యర్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఫీజు చెల్లించి స్టడీ కేంద్రాల్లో నమోదైన అభ్యర్థులు సార్వత్రిక విద్యాపీఠం నుంచి మెటీరియల్ ఇస్తారు. సెలవు రోజుల్లో స్టడీ కేంద్రాల్లో బోధనా తరగతులు నిర్వహించాలి. అయితే అలా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఎక్కడా తరగతులు నిర్వహించిన దాఖలాలు లేవు. సాధారణంగా పలు కారణాలతో కళాశాలలు, పాఠశాలలకు వెళ్లని అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతుంటారు. ఇంకా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు తమ ఉద్యోగోన్నతి కోసం ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. ఇదే అదునుగా భావించిన స్టడీ కేంద్రాల నిర్వాహకులు ఒక్కొక్కరి నుంచి దాదాపు రూ.10 వేలు చొప్పున రెండు జిల్లాల్లో రూ.6.25 కోట్లు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అనుకూలమైన వారికి విధులు....
తిరుపతి జిల్లాలో నిర్వహించే ఈ పరీక్షల్లో తమకు అనుకూలమైన వారికి ఇష్టానుసారం పరీక్షల విధుల నియామకాలు జరిగినట్లు తెలిసింది. ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్‌లు ఉండే సంబంధిత పాఠశాల కో ఆర్డినేటర్‌లకే విధులకు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. యథేచ్ఛగా మాస్ కాపీయింగ్ చేయించేందుకు అనుకూలమైన ఇన్విజిలేటర్‌లను వేయడం వివాదాలకు తావిస్తోంది.
ఓపెన్ స్కూల్ పరీక్షల మాస్ కాపీయింగ్ దందా ఇంటర్‌కు రూ.12 వేల నుంచి రూ.15 వేలు డబ్బుల వసూళ్లు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని స్టడీ సెంటర్‌లలో కలెక్షన్‌లు విద్యాశాఖ అధికారులకూ వాటాలు! నేటి నుంచి ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్‌స్కూళ్లు) ఆధ్వర్యంలో 3వ తేదీ నుంచి చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థుల నుంచి కొందరు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఓపెన్ స్కూళ్ల పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు బోధనా తరగతులు నిర్వహించే స్టడీ సెంటర్ల నిర్వాహకులు ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ వ్యవహారంపై చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పుమంటున్నాయి.
అక్రమాలకు పాల్పడితే చర్యలు
చిత్తూరు జిల్లాలో ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్య లు చేపట్టాం. ఈ పరీక్షలను కలెక్టర్ ఆదేశాల మేరకు పారదర్శకంగా నిర్వహించడం జరు గుతుంది. ప్రతి పరీక్ష కేంద్రంలో వీఆర్‌ఓలను, ఇతర అధికారులను సిట్టింగ్ స్క్వాడ్‌లుగా ఏర్పాటు చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ చూచి రాతలను ప్రోత్సహించేది లేదు. జిల్లా లోని కొన్ని స్టడీ కేంద్రాలను అభ్యర్థులకు హాల్ టికెట్‌లు ఇవ్వడం లేదని ఫిర్యాదులు అందాయి. హాల్ టికెట్‌లు ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎలాంటి అక్రమాలకు పా ల్పడినా సంబంధిత స్టడీ సెంటర్‌ను బ్లాక్ లిస్టులో పెడతాం. – వరలక్ష్మి, డీఈఓ, చిత్తూరు
పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తాం
తిరుపతి జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కలెక్టర్, డీఈఓ ఆదేశాల మే రకు చర్యలు కట్టుదిట్టంగా చేపట్టాం. ఫిర్యాదులు ఏవైనా ఉన్నట్‌లైతే లిఖిత పూర్వకంగా అందజేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. ఇందులో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదు.
– గురుస్వామిరెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ పరీక్షల విభాగం,
తిరుపతి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment