డయాబెటిక్ సెంటర్‌లో అగ్నిప్రమాదం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఉన్న ఎస్‌వీఆర్ డయాబెటిక్ సెంటర్‌లో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరగడంతో మంటలు వ్యాప్తి చెందాయి. ఈ విషయాన్ని అక్కడి స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కాగా ఆ సెంటర్‌లోని వస్తువులు, ఫైల్స్ కాలిపోయాయి. అయితే ఈ ప్రమాదంలో లక్ష రూపాయల మేర నష్టం జరిగి ఉండవచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. ఈ రెస్క్యూలో జిల్లా అడిషనల్ అగ్నిమాపక శాఖ అధికారి కరుణాకర్, అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
డయాబెటిక్ సెంటర్‌లో అగ్నిప్రమాదం
డయాబెటిక్ సెంటర్‌లో అగ్నిప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment