మానవ హక్కుల రక్షణకు కృషి
తిరుపతి సిటీ: దేశంలో బడుగు, బలహీవర్గాలకు అండగా నిలబడి మానవహక్కుల పరిరక్షణకు కృషి చేయాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతిలోని ఎస్వీయూ శ్రీనివాస ఆడిటోరియంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మూడో వార్షికోత్సవం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ హక్కుల ఉల్లంఘనలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ టీమ్ వెంటనే స్పందిస్తూ బాధితులకు న్యాయం అందిస్తోందన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం విద్యార్థులు, నిపుణులు, మేధావులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం వారికి జ్ఞాపికలు బహూకరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ ప్రభాకర్‌రెడ్డి, హ్యూమన్‌రైట్స్ ప్రతినిధులు బుల్లెట్ రవి, భాస్కర్, మేఘన, హరీఫ్, రమేష్ , మణి, శివకృష్ణ, పూర్ణచంద్రా రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment