హైందవ పరిరక్షణకు కృషి చేయాలి
పుత్తూరు : హైందవ పరిరక్షణకు బ్రాహ్మణులందరూ ఐక్యంగా కృషి చేయాలని తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘం సంక్షేమ సమాఖ్య గౌరవాధ్యక్షుడు ఆలూరు రామకృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం పుత్తూరులోని గాయత్రీ బ్రాహ్మణ భవన్‌లో జిల్లా సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రామశర్మ మాట్లాడుతూ.. త్వరలో అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించనున్న బ్రాహ్మణ సంఘం కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
ఇటీవల రాయచోటి రాములవారి ఊరేగింపులో అర్చకులపై దురుసుగా ప్రవర్తివంచిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి పేరరాజుశర్మ వేద పండితులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. చట్ట సభల్లో బ్రాహ్మణులకు తగిన ప్రాధాన్యం కల్పించాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో పలు బ్రాహ్మణ సంఘాల ప్రతినిదులు అజయ్‌కుమార్, మల్లికార్జునశర్మ, రమేష్ పురోహితులు, విజయ్‌కుమార్, బాలాజీ, రమేష్, బాలాజీరావు, కిరణ్, సుజాత, సుమన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment