పంటలపై ఏనుగుల బీభత్సం
బంగారుపాళెం : మండలంలోని అటవీ సరిహద్దు గ్రామాలైన పులిమడుగు, శ్రీనివాసపురం గ్రామాల్లో శనివారం రాత్రి పంట పొలాలను ఏనుగులు ధ్వంసం చేశాయి. రైతులు వేలు, శ్రీను, బాలాజీ, మురుగన్‌కు సంబంధించిన రాగి, వరి, టమాట పంటను నాశనం బాధితులు వాపోయారు. ఏనుగుల రాకను గుర్తించిన రైతులు కేకలు వేసి డప్పులు కొట్టడంతో అడవిలోకి వెళ్లిపోయాయన్నారు. నాలుగు రోజులుగా రైతుల పొంట పొలాలపై ఏనుగులు దాడులు చేస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
అష్ట కష్టాలు పడి, అప్పులు చేసి సాగు చేసిన పంటలు చేతి కందే సమయంలో ఇలా పంటలు నాశనం అవుతున్నాయని వాపోయారు. ఏనుగు దాడుల్లో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. పంట పొలాలపైకి ఏనుగులు రాకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment