● 306 లీటర్ల పాలకు డబ్బులు ఇవ్వని వైనం ● లబోదిబోమంటున్న
పాడి రైతులకు
‘హెరిటేజ్’ అన్యాయం
రొంపిచెర్ల : రైతుల నుంచి సేకరించిన పాలకు డబ్బు సక్రమంగా చెల్లించడం లేదని మండలంలోని చెంచెంరెడ్డి గారిపల్లె పంచాయతీ లంకిపల్లెవారిపల్లెకు చెందిన హెరిటేజ్ ఏజెంట్ రెడ్డెప్ప నాయుడు ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 20 ఏళ్లుగా హెరిటేజ్ ఏజెంటుగా పని చేస్తున్నానని తెలిపారు. అయితే ఈనెల 1, 2, 4, 5వ తేదీలలో పీలేరు హెరిటేజ్ డెయిరీ 306 లీటర్ల పాలు పోసుకుని ఒక రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. నాలుగు రోజుల పాల డబ్బులు రైతులకు తన చేతి నుంచి రూ.10 వేలు ఇచ్చినట్లు చెప్పారు. ఏజెంట్‌గా తనకు ఒక లీటరు పాలకు రూ.90 పైసల నుంచి రూపాయి మాత్రమే ఇస్తారని, అయితే రూ.10 వేలు సొంత సొమ్మును పాలు పోసిన రైతులకు ఇస్తే హెరిటేజ్ డెయిరీ పట్టించుకోకుండా పాడి రైతులకు అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా హెరిటేజ్ అధికారులు స్పందించి 306 లీటర్ల పాల డబ్బును చెల్లించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment