భక్తిశ్రద్ధలతో పెద్ద దేవర్లు | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో పెద్ద దేవర్లు

Published Mon, Mar 24 2025 6:47 AM | Last Updated on Mon, Mar 24 2025 9:24 AM

భక్తి

భక్తిశ్రద్ధలతో పెద్ద దేవర్లు

కనిపించని సౌర వెలుగులు
కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన సూర్యఘర్‌ పథకానికి జిల్లాలో స్పందన అంతంత మాత్రంగానే ఉంది.
మానవాళి సంక్షేమానికే సైకిల్‌ యాత్ర

సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2025

కాణిపాకం : సచివాలయ వ్యవస్థ కింద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,069 మంది ఏఎన్‌ఎంలు పని చేస్తున్నారు. ఫస్ట్‌ ఏఎన్‌ఎంలుగా 247 మంది, సెకండ్‌ ఏఎన్‌ఎంలుగా 644 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా కొన్నేళ్లుగా సెకండ్‌ ఏఎన్‌ఎం, కాంట్రాక్టు ఏఎన్‌ఎంలుగా విధులు నిర్వర్తించడంతో 2019లో జరిగిన గ్రామ, వార్డు సచివాలయ హెల్త్‌ సెక్రటరీ పోస్టులకు కొందరు డిస్ట్రిక్‌ సెలక్షన్‌ కమిటీ ద్వారా 10 నుంచి 15 మార్కుల వెయిటేజీతో విధుల్లో చేరారు.

విడతల వారీగా చేరుతూ..

గ్రామ, వార్డు సచివాలయాలు 2019 అక్టోబర్‌ 2న ప్రారంభం కాగా, హెల్త్‌ సెక్రటరీలుగా సరైన రికార్డులతో విధుల్లో చేరాల్సి ఉంది. అందులో కొందరు అక్టోబర్‌ 14న కొంత మంది విధులకు రిపోర్టు చేశారు. మరికొంత మంది అక్టోబర్‌ 16 నుంచి డిసెంబరు నెలాఖరు వరకు విధుల్లో చేరుతూ వచ్చారు. జిల్లాలో మూడు విడతలుగా పోస్టింగ్‌ ఆర్డర్లు విడుదల చేయగా.. అభ్యర్థులు వారికి అనుకూలమైన తేదీల్లో జాయినింగ్‌ అయ్యారు. కొంత మంది అభ్యర్థుల సర్టిఫికెట్‌లు సక్రమంగా లేకపోవడం, పూర్తి స్థాయిలో సర్టిఫికెట్‌లు వెరిఫికేషన్‌ చేసి పోస్టింగ్‌ ఆర్డర్లు ఇవ్వడం ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో బోగస్‌ సర్టిఫికెట్లతో విధుల్లో చేరిన కొందరిని గుర్తించి, తిరిగీ సర్టిఫికెట్లు పరిశీలించగా.. కొంత మంది సకాలంలో సమర్పించకపోవడంతో విధుల నుంచి తొలగించారు.

రూపకల్పన ఇలా..

గ్రేడ్‌–3 ఏఎన్‌ఎం నుంచి గ్రేడ్‌–2 ఏఎన్‌ఎంల ఉద్యోగోన్నతులకు గతేడాది ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈ మేరకు జిల్లాలో ఖాళీగా ఉన్న గ్రేడ్‌–2 పోస్టులకు అర్హుల జాబితా తయారవుతోంది. అయితే ఈ జాబితా తయారీలో వైద్య ఆరోగ్య జిల్లా వైద్యాధికారుల తీరు ఏఎన్‌ఎంలలో అలజడి సృష్టిస్తోంది. కార్యాలయంలో ఇష్టారాజ్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు వారిని అయోమయంలో పడేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జాబితా తయారీ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో ఎస్టీ కేటగిరికి 6 శాతం, ఎస్సీకి 15 శాతం రిజర్వేషన్‌ ప్రకారం చేశారు. అయితే జనరల్‌ కేటగిరిలో ఎస్టీ కేటగిరికి తీవ్ర అన్యాయం జరిగిందని గోలగోల చేస్తున్నారు. ఎస్టీ కులానికి చెందిన కొందరు ఏఎన్‌ఎంలకు మెరిట్‌ ఉన్న జనరల్‌ కేటగిరిలో వారిని పక్కన పెట్టేశారని, వికలాంగులను పట్టించుకోలేదనే వాదనలు ఉన్నాయి. సిఫార్సులకు తలొగ్గినట్లు విమర్శలు వస్తున్నాయి. కొన్నింటికి బేరసాలు జరిగినట్లు, కలెక్టర్‌ బంగ్లాకు సమీపంలోని ఓ కేఫ్‌లో బేరసాలు జరిగినట్లు కొందరు ఆరోపిస్తున్నారు.

తప్పులు కప్పిపుచ్చే ప్రయత్నం

ఉద్యోగోన్నతుల జాబితా తయారీలో పలు ఆరోపణలు వస్తున్నా వాటిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పూర్తిగా పట్టించుకోవడంలేదు. ఏఎన్‌ఎంలు పలు సమస్యలు తీసుకొస్తున్నా వాటిని లెక్క చేయకుండా ప్రభుత్వ విధి విధానాల పేరుతో తప్పించుకుంటున్నారు. జాబితాలో తప్పులు ఉన్న వాటిని కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై జిల్లా యంత్రాంగం ప్రశ్నించిన జాబితా విషయంలో దొరక్కుండా సమాధానం ఇవ్వాలని హుకుం జారీ అయినట్లు సమాచారం.

ఇఫ్తార్‌ నిర్వహణకు

రూ.4.35 లక్షల విరాళం

– పెద్దిరెడ్డి కుటుంబం ఔదార్యం

పుంగనూరు : రంజాన్‌ ఉపవాస దీక్షల నేపథ్యంలో ముస్లింల పట్ల పెద్దిరెడ్డి కుటుంబం తమ ఔదార్యాన్ని చాటుకుంది. పట్టణంలోని 29 మసీదుల్లో ఇఫ్తార్‌ నిర్వహణకు పెద్దిరెడ్డి కుటుంబం తరఫున తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి రూ.4.35 లక్షల విరాళాన్ని ముస్లిం పెద్దలకు ఆదివారం అందజేశారు. ఏటా ముస్లింలకు విరాళం అందజేయడం తమ కుటుంబం సంప్రదాయమని చెప్పారు. కార్యక్రమంలో చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప, పలువురు మసీదు పెద్దలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఒక్క రోజులో బిల్లుల

చెల్లింపు రూ.1.14.కోట్లు

చిత్తూరు కార్పొరేషన్‌ : విద్యుత్‌ బిల్లులు చెల్లింపుల కేంద్రానికి ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ అందుబాటులో ఉంచారు. ఈ మేరకు చిత్తూరు, తిరుపతి జిల్లాల నందు సేవలను వినియోగదారులు వాడుకున్నారు. రెండు జిల్లాల పరంగా మొత్తం10 వేల 200 మంది వినియోగదారులు బిల్లులు చెల్లించగా తద్వారా రూ.1.14 కోట్లు వచ్చిందని ట్రాన్స్‌కో ఎస్‌ఈలు ఇస్మాయిల్‌ అహ్మద్‌, సురేంద్రనాయుడు వివరించారు.

ఒకే ఈతలో మూడు దూడలు

ఐరాల : మండలంలోని యదర్లపల్లెలో ఆదివారం రైతు వినోద్‌కు చెందిన ఆవు ఒకే ఈతలో మూడు కోడె దూడలను ఈనింది. వీటిని చూసేందుకు స్థానిక, సమీప గ్రామస్తులు ఆసక్తి కనబ రిచారు. అయితే కొద్దిసేపటికి రెండు దూడలు మృతి చెందాయి. ఒక దూడ ఆరోగ్యంగా ఉందని రైతు తెలిపారు. ఇలాంటి సంఘటనలు జన్యుపరమైన లోపంతో జరుగుతుంటాయని పశువైద్యశాఖ ఏడీ పద్మావతి తెలిపారు. ఇవి బతకపోవడానికి రెండు కారణాలు ఉంటాయని, బలహీనంగా ఉండడం, చేతులతో గట్టిగా లాగడం చేస్తే దూడలు చనిపోతాయని తెలిపారు.

నేడు కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక

చిత్తూరు కలెక్టరేట్‌ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని పేర్కొన్నారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట ఏఎన్‌ఎంల నిరసన

నేడు ప్రపంచ టీబీ దినోత్సవ ర్యాలీ

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు నగరంలో సోమవారం ప్రపంచ టీబీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా క్షయ నివారణ అధికారి వెంకట ప్రసాద్‌ తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం 8.30 గంటలకు చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపడతామన్నారు. అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో సమావేశం ఉంటుందని తెలిపారు.

నగరి: మానవాళి సంక్షేమాన్ని కోరుతూ సైకిల్‌ యాత్ర చేపట్టినట్లు నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం శ్రీపతిరావుపేటలోని సంజీవరాయ ఆంజనేయస్వామి ప్రధాన అర్చకులు కాశ్యపు అశోకయ్యస్వామి తెలిపారు. ఆయన ఈ నెల 19న ఆత్మకూరు నుంచి తమిళనాడులోని ఘటికాచలం వరకు 450 కిలోమీటర్ల సైకిల్‌ యాత్ర ప్రారంభించారు. ఆదివారం నగరి పట్టణ పరిధిలోని నెత్తంకండ్రిగకు చేరుకున్నారు. ఆయన మాట్లాడుతూ నంద్యాల, ఆళ్లగడ్డ, మైదుకూరు, కడప, రేణిగుంట, తిరుపత్తణి మీదుగా ఘటికాచలం చేరుకోనున్నట్లు తెలిపారు. గతంలోనూ ఆత్మకూరు నుంచి పండరీపురం, శ్రీకోయిలూరు మీదుగా మంత్రాలయానికి సైకిల్‌ యాత్ర చేసినట్టు తెలిపారు.

గుడుపల్లె : మండలంలోని జోగ్యానూరులోని సిద్ధేశ్వరస్వామి, బీరేశ్వరస్వామి ఆలయాల్లో కురబ కులస్తులు పెద్ద దేవర్ల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మూడు రోజుల పాటు గ్రామంలోని ఆలయ ఆవరణలో కర్ణాటక, ఆంధ్రా రాష్ట్రాల్లోని 300 మంది కురబ కులస్తులు పెద్ద దేవర సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. బయట ప్రాంతాల నుంచి వచ్చిన కురబ కుటుంబాల వారు ఒకరోజు రాత్రి అక్కడే బస చేసి ఉదయాన్నే స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో సంప్రదాయబద్ధంగా దేవర ఎద్దుకు ప్రత్యేక పూజలు చేశారు.ఆలయం వద్ద భక్తిశ్రద్ధలతో తలపై టెంకాయలు కొట్టే కార్యక్రమం చేపట్టారు. రాత్రి భక్తుల వినోదం కోసం కోలాటలు, పౌరాణిక నాటకాలను ప్రదర్శించారు.

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

ఉమ్మడి జిల్లా ఏఎన్‌ఎంల వివరాలు..

సచివాలయ ఏఎన్‌ఎంలు – 1069

ఫస్ట్‌ ఏఎన్‌ఎంలు – 247

సెకండ్‌ ఏఎన్‌ఎంలు – 644

పదోన్నతుల జాబితా – 307

ఎస్టీల రిజర్వేషన్‌ – 6 శాతం

ఎస్సీల రిజర్వేషన్‌ – 15

ఆర్డర్‌ మేరకు ఇవ్వాలి..

వైద్య ఆరోగ్యశాఖలో ర్యాంకు ప్రకారమే పదోన్నతులు చేస్తామని చెబుతున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌కు తెలియజేశాం. కలెక్టర్‌ అపాయింట్‌ ఆర్డర్‌ ప్రకారమే చేస్తామని హామీ ఇచ్చారు. అయితే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం ర్యాంకు ప్రకారమే చేస్తామని చెబుతున్నారు. అప్పుడు మూడు బ్యాచ్‌లుగా తీసుకున్నారు. ఇప్పుడు ఫస్ట్‌ బ్యాచ్‌కు పదోన్నతుల్లో తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. – గీత, ఏఎన్‌ఎం

కలెక్టర్‌ చెప్పినా పట్టించుకోవడం లేదు..

మమల్ని ఫస్ట్‌ బ్యాచ్‌లో తీసుకున్నారు. అయితే ఫస్ట్‌ బ్యాచ్‌ను పక్కన పెట్టి..ర్యాంకు ఆధారంగా చేసుకుంటున్నారు. దీనిపై మాకు అనుమానాలున్నాయి. ఉద్యోగోన్నతుల కోసం దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇలా చేస్తే ఫస్ట్‌ ఏఎన్‌ఎం, సెకండ్‌ ఏఎన్‌ఎంల, వయస్సు మళ్లిన వారి పరిస్థితి ఏంటి? ఈ విషయంపై కలెక్టర్‌ చెప్పినా పెడచెవిన పెడుతున్నారు. ఫస్ట్‌ బ్యాచ్‌కు పదోన్నతులు కల్పించాలి . – క్రిష్ణమ్మ, ఏఎన్‌ఎం

పారదర్శకంగా చేపడుతాం

ఏఎన్‌ఎంల పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వ ఆదేశాల మేరకు పారదర్శకంగా చేస్తున్నాం. కలెక్టర్‌కు వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం. 307 మందితో మెరిట్‌ లిస్ట్‌ ఇచ్చాం. ఆ 307 మందికి పదోన్నతులు ఉండవు. 297 మందికే ఉంటాయి. జాబితాలో ఏవైనా లోటుపాట్లు ఉంటే..అందుకు అదనంగా కొంత మందిని లిస్టులో పెట్టాం. మరో 5 మందిని జాబితాలోకి తీసుకోలేదు. ఇంకా జాబితా పూర్తి కాలేదు.

– సుధారాణి, డీఎంఅండ్‌హెచ్‌ఓ, చిత్తూరు

ఏఎన్‌ఎంల ఉద్యోగోన్నతుల జాబితాలో గందరగోళం నెలకొంది. ర్యాంకు ఆధారంగా ఫైనల్‌ జాబితా సిద్ధం చేశారంటూ ఆందోళన మొదలైంది. డేట్‌ ఆఫ్‌ జాయినింగ్‌ పక్కన పెట్టారని, జాబితా తయారీలో అన్యాయం జరిగిందంటూ పలువురు ఏఎన్‌ఎంలు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగోన్నతుల కోసం తప్పుడు పత్రాలు సమర్పించారని, సిఫార్సులకు పెద్దపీట వేశారని, ఎస్టీ కేటగిరికి జనరల్‌లో అన్యాయం జరిగిందంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.

వైద్య ఆరోగ్య శాఖలో ఇష్టారాజ్యం

2 రోజుల్లో ఏఎన్‌ఎంల పదోన్నతుల జాబితా ప్రకటన?

ర్యాంకు ఆధారంగా ఫైనల్‌ లిస్టు సిద్ధం

డేట్‌ ఆఫ్‌ జాయినింగ్‌ను పక్కన పెట్టిన వైనం

జాబితా తయారీలో అన్యాయంపై ఏఎన్‌ఎంల ఆందోళన

తప్పుడు పత్రాలు ఉన్నాయంటూ ఆరోపణలు

ఎస్టీలకు జనరల్‌ కేటగిరీలో అన్యాయం

కలెక్టర్‌కు ఫిర్యాదుల పరంపర

స్పష్టత లేని జాబితా

గ్రేడ్‌–3 ఏఎన్‌ఎంలు 1069 మంది ఉన్నారు. ఉద్యోగోన్నతుల్లో భాగంగా ఇటీవల విడుదల చేసిన మెరిట్‌ లిస్టులో 307 మంది పేర్లను ప్రకటించారు. ఇందులో 297 మందికే పదోన్నతులు ఉంటాయని చెప్పడంపై గందరగోళంగా మారింది. దీనిపై అనుమానం రావడంతో తమకు అన్యాయం జరిగిందంటూ కొంత మంది కలెక్టర్‌ను కలిసి విన్నవించార. ఈ మేరకు మరో 5 పోస్టులు ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శాఖ కమిషనర్‌కు నివేదికలు సమర్పించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ 5 మంది పేర్లను జాబితాలో చేర్చారని తెలిసింది. మళ్లీ కొంత మంది కలెక్టర్‌ను కలిసి పదోన్నతుల జాబితాలో జరిగిన తప్పులను ఎత్తి చూపిస్తున్నారు. ఇష్టానుసారంగా జాబితాను తయారు చేయడంపై మండిపడుతున్నారు. ఇలానే కొనసాగితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
భక్తిశ్రద్ధలతో పెద్ద దేవర్లు 1
1/7

భక్తిశ్రద్ధలతో పెద్ద దేవర్లు

భక్తిశ్రద్ధలతో పెద్ద దేవర్లు 2
2/7

భక్తిశ్రద్ధలతో పెద్ద దేవర్లు

భక్తిశ్రద్ధలతో పెద్ద దేవర్లు 3
3/7

భక్తిశ్రద్ధలతో పెద్ద దేవర్లు

భక్తిశ్రద్ధలతో పెద్ద దేవర్లు 4
4/7

భక్తిశ్రద్ధలతో పెద్ద దేవర్లు

భక్తిశ్రద్ధలతో పెద్ద దేవర్లు 5
5/7

భక్తిశ్రద్ధలతో పెద్ద దేవర్లు

భక్తిశ్రద్ధలతో పెద్ద దేవర్లు 6
6/7

భక్తిశ్రద్ధలతో పెద్ద దేవర్లు

భక్తిశ్రద్ధలతో పెద్ద దేవర్లు 7
7/7

భక్తిశ్రద్ధలతో పెద్ద దేవర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement