
సెలెస్టాలో తళుక్కుమన్న ...నేపాలీ తార
కాణిపాకం : సెలెస్టాలో నేపాలీ తార నితిషా తళుక్కుమంది. చిత్తూరు నగరంలోని ఎస్వీ సెట్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం సెలెస్టా 2కే 25 ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత సంప్రదాయ కళలు, జానపద సాహిత్యం, ఆధునిక హిప్ హాఫ్ షోలు అదుర్స్ అనిపించాయి. బ్యాండ్ షో మోత మోగించింది. అనంతరం నేపాలీ తార నితిషా విద్యార్థులతో ముచ్చటిస్తూ ఉత్సాహ పరిచారు. తదనంతరం ఎస్పీ మణికంఠ ఛందోలు మాట్లాడుతూ.. విద్యార్థి దశ అత్యంత కీలకమన్నారు. ఈ దశ నుంచి భవిష్యత్తును ఎంచుకోవాలన్నారు. ఇప్పటి నుంచే గోల్ కోసం పట్టుపట్టాలన్నారు. కార్యక్రమంలో కాలేజీ చైర్మన్లు రావూరి వెంకట స్వామి, రావూరి శ్రీనివాసులు పాల్గొన్నారు.

సెలెస్టాలో తళుక్కుమన్న ...నేపాలీ తార